Andhra Pradesh

News March 25, 2024

విశాఖ దక్షిణ టికెట్‌పై ఉత్కంఠ

image

జనసేన నిన్న ప్రకటించిన జాబితాలో విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేరు లేదు. YCP నుంచి జనసేనలోకి వచ్చిన ఈయనకు విశాఖ దక్షిణ టికెట్ కేటాయిస్తానని జనసేన అధినేత పవన్ గతంలో హామీ ఇచ్చినట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట మంగళగిరిలో ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారన్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ పేరు లేకపోవడంతో ఈ టికెట్ ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

News March 25, 2024

లింగాల: వేట కొడవలితో వ్యక్తిపై దాడి

image

లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లెలో ఆకుల లక్ష్మీ నారాయణపై వెన్నపూస నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆదివారం రాత్రి వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల లక్ష్మీనారాయణ కుటుంబంలోని మహిళ పట్ల నారాయణరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడని అతనిపై కేసు నమోదు చేయించారు. దీనిని మనసులో పెట్టుకున్న నారాయణరెడ్డి లక్ష్మీనారాయణపై దాడి చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.

News March 25, 2024

వరదయ్యపాళెం: అక్క మరణాన్ని తట్టుకోలేక దివ్యాంగుడి ఆత్మహత్య

image

మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన బీఎన్ కండ్రిగ మండలంలో చోటుచేసుకుంది. SI ప్రతాప్ వివరాల ప్రకారం.. కంచనపుత్తూరునకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుడైన బాలమురుగయ్య (26) మండలంలోని ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంలో నివాసముంటూ వరదయ్యపాళెం SBI ఎదురుగా నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల అక్క హత్యకు గురికాగా మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 25, 2024

3 నెలల్లో 1,284 మద్యం కేసులు నమోదు: ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 1,284 మద్యం కేసులు నమోదయ్యాయని అనంతపురం ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 1,272 మందిని అరెస్టు చేసి 206 వాహనాలు సీజ్ చేశామన్నారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చెక్ పోస్టులో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారని వెల్లడించారు.

News March 25, 2024

నంద్యాల జిల్లాలో రెండో మహిళా అభ్యర్థిగా బైరెడ్డి శబరి

image

నంద్యాల TDP MP అభ్యర్థిగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి 1952లో తొలిసారిగా ఎన్నికలు జరగగా.. స్వతంత్ర అభ్యర్థి శేషగిరి రావు కాంగ్రెస్ అభ్యర్థి NR రెడ్డిపై 6,604 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004లో TDP తరఫున పోటీ చేసిన భూమా శోభానాగిరెడ్డి, నియోజకవర్గం నుంచి తొలి మహిళా MP అభ్యర్థిగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో శబరి పోటీ చేయనుండటంతో నంద్యాల నుంచి రెండో మహిళా ఎంపీ అభ్యర్థిగా నిలుస్తారు.

News March 25, 2024

నెల్లూరులో స్నేహితుడిపై హత్యాయత్నం

image

నెల్లూరులోని కోటమిట్టకు చెందిన మసూద్, బారకాసు సెంటర్ కు చెందిన సోహెల్ స్నేహితులు. ఫోన్ లో మాట్లాడుకునే సమయంలో వాగ్వాదం జరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. శనివారం రాత్రి సోహెల్ ఫోన్ చేసి పిలవడంతో మరొకరితో పాటు రంగనాయకులపేటకు మసూద్ వెళ్లాడు. అక్కడ మాటామాటా పెరగడంతో సోహెల్ తన స్నేహితులతో కలిసి మసూద్ ను కత్తితో పొడిచి పరారయ్యాడు. మసూద్ ను అస్పత్రికి తరలించారు. సంతపేట పోలీసులు విచారణ చేపట్టారు.

News March 25, 2024

శ్రీకాకుళం: భల్లూకాల దాడులు.. వణికిపోతున్న ప్రజలు

image

వజ్రాపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట మండలాల్లోని గ్రామాల్లో ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది. జీడిపిక్కల కాలం కావడంతో సంచారిస్తున్నాయి. రైతులు, కూలీలు పనులకు వెళ్లాలంటే తీవ్ర భయాందోళన గురి అవుతున్నారు. శనివారం ఇద్దరిని ఎలుగు పొట్టన పెట్టుకుంది. అటవీ అధికారులు బోనులు ఏర్పాటు చేయకపోవడంతోనే దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్థానికంగా ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి.

News March 25, 2024

జియ్యమ్మవలస: గవరమ్మపేటలో ఏనుగులు

image

జియ్యమ్మవలస మండలంలోని వెంకటరాజుపురం, గవరమ్మపేట గ్రామాల మధ్య ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అరటి, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఏనుగులతో పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

News March 25, 2024

అప్పుడు ప్రజారాజ్యం ఎమ్మెల్యే.. ఇప్పుడు పెందుర్తి జనసేన అభ్యర్థి

image

జనసేన టికెట్ దక్కించుకున్న పంచకర్ల రమేష్ బాబు 2009లో పెందుర్తి నుంచి మొదటిసారిగా ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎలమంచిలి నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2023లో వైసీపీలో చేరిన ఆయన జిల్లా అధ్యక్షుని పనిచేశారు. అనంతరం రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

News March 25, 2024

వైసీపీ మాటలు నమ్మి మోసపోకండి: మాజీ మంత్రి పల్లె

image

వైసీపీ నాయకుల మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లమాడ మండలం దొన్నికోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్టపర్తి టీడీపీ, జనసేన, ఉమ్మడి అభ్యర్థికి పల్లె సిందూరకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.