Andhra Pradesh

News March 24, 2024

కృష్ణా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షల టోకరా

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70 లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్‌ (40) ఆన్‌లైన్‌ ట్రేడర్‌. మ్యాట్రిమోని ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్న ఇతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

News March 24, 2024

విశాఖ తీరంలో సోమర్సెట్… బాహుబలి నౌక!

image

భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్ సోమర్సెట్’ విశాఖతీరానికి చేరుకుంది. ఇది ఉభయచర యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది.

News March 24, 2024

‘టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగిరేనా’

image

1982లో టీడీపీ స్థాపన అనంతరం నందిగామ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1989లో కాంగ్రెస్, 2019లో వైసీపీ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా టీడీపీ తమ ఇన్‌ఛార్జ్ తంగిరాల సౌమ్యకు టికెట్ ఇవ్వగా, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్‌ను బరిలోకి దించింది. వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా ఎగురుతుందా, వైసీపీ ఆధిపత్యం చూపునా మీ కామెంట్.

News March 24, 2024

చిత్తూరు: యథావిధిగా బిల్లుల వసూల్లు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు ఆది, సోమవారాలు యథావిధిగా పనిచేస్తాయని ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించాలని కోరారు.

News March 24, 2024

పల్నాడు జిల్లాలో రూ.1 కోటి సామగ్రి సీజ్

image

కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ జరుగుతుందని శనివారం జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. కోడ్ ఉల్లంఘన సహితమైన 11225 (పబ్లిక్), 3938 ప్రయివేటు అంశాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రూ.17.94 లక్షల నగదు, రూ.23.31 లక్షలు విలువైన లిక్కర్, ఇతర సామగ్రి 52.65 లక్షలు, మొత్తం రూ.1.1 కోట్ల వరకు సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News March 24, 2024

నెల్లూరు: సెలవైనా కరెంట్ బిల్లు కట్టవచ్చు

image

విద్యుత్ బిల్లులను ఆది, సోమవారాల్లో యథావిధిగా చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ నెల్లూరు జిల్లా ఎస్ఈ విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ సందర్భంగా సోమవారం సెలవైనప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పని చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 24, 2024

కోడలిని తమకు అప్పగించాలని ఎస్పీకి అత్త ఫిర్యాదు

image

తమ కోడలిని తమకు అప్పగించాలని ఓ అత్త ఏలూరు SPకి ఫిర్యాదు చేసింది. నవాబుపేటకు చెందిన సురేష్ Febలో లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. యువతి పేరెంట్స్‌కి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఓ న్యాయవాది వద్ద కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈనెల 22న ఆ న్యాయవాది ఇంటి నుంచి యువతిని తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారని, దాంతో సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

News March 24, 2024

సింహాచలం సింహాద్రి అప్పన్నకు రేపు పెళ్లి చూపులు

image

సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్టింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.

News March 24, 2024

సింహాచలం: సింహాద్రి అప్పన్నకు రేపు పెళ్లి చూపులు

image

సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్ఠింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.

News March 24, 2024

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా?

image

డోన్ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం కలిశారు. గతంలో ధర్మవరం సుబ్బారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. తదుపరి పరిణామాల వల్ల సూర్యప్రకాశ్ రెడ్డికి సీటు కేటాయించారు. నియోజవర్గం పరిస్థితులపై బాబు ఇరువురి నేతలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు సమాచారం.