India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈనెల 28న జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 27న జోన్ 4లో మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ ముగించుకొని, అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని కదిరిలో ప్రజాగళం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉద్దానం ప్రాంతంలో నిన్న ఎలుగుబంటి ఇద్దరిని చంపిన విషయం తెలిసిందే. జీడితోటకు వెళ్లిన రైతులపై దాడి చేయగా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లికి చెందిన చిడిపల్లి లోకనాథం(46), అప్పికొండ కూర్మారావు(48) చనిపోయారు. మహిళా రైతు చిడిపల్లి సావిత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరి మరణానికి కారణమైన ఎలుగుబంటి సమీప తోటల్లో చనిపోయినట్లు సమాచారం.
టీడీపీలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా దర్శి టీడీపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ ఇస్తామని అధిష్ఠానం భరోసా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు దర్శిలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. మరి ఈయన పార్టీలో చేరితే పొత్తులో భాగంగా సీటు వస్తుందో రాదో చూడాలి.
చిత్తూరు జిల్లాలో లైసెన్స్ కలిగిన 697 తుపాకులను పలువురు కలిగి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో స్థానిక పోలీసు స్టేషన్ల ద్వారా 624 డిపాజిట్ చేయించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. మిగిలిన 73 తుపాకులు బ్యాంకుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులు, ఏటీఎం కేంద్రాలకు డబ్బులు తీసుకెళ్లే సెక్యూరిటీ ఏజెన్సీ వారివి కావడంతో మినహాయింపు ఇచ్చినట్టు చెప్పారు.
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన గుంటూరు నాగేశ్వరావు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొక్కా పరంజ్యోతి శనివారం పార్టీ కార్యాలయంలో నాగేశ్వరావును సన్మానించి, టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. విజయం సాధిస్తానని నాగేశ్వరావు ధీమా వ్యక్తం చేశారు. నాగేశ్వరావును పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.
నెల్లూరు అరవింద్ నగర్ లో లీలావతి అనే మహిళ ఏడాదిగా అద్దెకు ఉంటున్నారు. శనివారం ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులు తలుపులు పగలగొట్టారు. లోపల రక్తపుమడుగులో లీలావతి మృతదేహం ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హతమార్చి తాళం వేసి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఆమె ఆధార్ కార్డులో భర్త భాస్కర్ రెడ్డి, ట్రంకురోడ్డు, నెల్లూరు అని ఉంది. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రొద్దుటూరు నుంచి ఈనెల 27న ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి అంజద్ బాషా, మేయర్ సురేశ్ బాబు అధ్యక్షతన కడపలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సభ నిర్వహణకు తీసుకోవాల్సిన అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. సభకు భారీగా ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా (జీరో వయలెన్స్.. నో రీపోల్), పూర్తి స్వేచ్ఛగా, సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. శనివారం ఆయన మందస, పలాస, నందిగాం మండలాల్లో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వివిద రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు, ప్రజలు అందరూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమి ఆదేశించారు. ఎస్పీ అన్బురాజన్‌తో కలిసి రాయదుర్గంలో ఆమె పర్యటించారు. జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీకి అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ జరిగిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఎక్కడా లోపం లేకుండా పనులు నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.