Andhra Pradesh

News March 23, 2024

పాడేరుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

2019 ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీకి సంబంధించి తక్కువగా (62 శాతం) పోలింగ్ నమోదు కావడంతో ఈ దఫా పోలింగ్ శాతం పెంపునకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. అల్లూరి జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని తెలిపారు. అన్ని ప్రధాన జంక్షన్లు, పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News March 23, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: డీఐజీ

image

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. 4 జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News March 23, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులకు తీవ్ర గాయాలు

image

వజ్రకరూరు మండలం కమలపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కమలపాడుకు చెందిన రవితేజ, అజయ్, నరేష్ కొనకొండ్ల జడ్పీ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాశారు. బైక్‌లో ముగ్గురు కమలపాడుకు బయలుదేరారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు.

News March 23, 2024

పల్నాడు: గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో మంటలు

image

గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రహదారిపై ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయని, ఈ ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైందన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 23, 2024

కోటబొమ్మాళి: ఆటో నుంచి జారిపడి మహిళ మృతి

image

కోటబొమ్మాళి మండల కేంద్రం స్టేట్ బ్యాంకు సమీపంలో పలాసకు చెందిన బతకల పార్వతి(45) శనివారం ఆటోనుంచి జారిపడి మృతి చెందింది. రెండు రోజుల క్రితం కోటబొమ్మాళి వంట పనులకు వచ్చి తిరిగి వెళుతుండగా ఆటోలో నుంచి జారిపడి తలకు దెబ్బ తగిలింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కోటబొమ్మాళి ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.

News March 23, 2024

మదనపల్లి: చెరువులో భవన కార్మికుడు మృతదేహం కలకలం

image

చెరువులో దూకి భవన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం మదనపల్లి మండలంలో చోటుచేసుకుంది. తాలూకా సిఐ ఎన్ శేఖర్ కథనం మేరకు.. బసినికొండ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉంటున్న కొండయ్య (37) వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. శనివారం బసినికొండ పొంతల చెరువులోని నీటిపై మృతదేహం తేలియాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొండయ్య మృతదేహాన్ని వెలికి తీశారు.

News March 23, 2024

నంద్యాల: గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

బనగానపల్లె పట్టణం ఖాజీ వాడలో నివాసం ఉంటూ యనకండ్ల గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షాషావలి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఖాజీ వాడాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చిన్ననాటి స్నేహితుడు టీచర్ షాషావలి మృతి చెందడం పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు.

News March 23, 2024

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మురళీక్రిష్ణ శనివారం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించిన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

News March 23, 2024

ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు

image

ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కిలేశపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇరువురు హర్ష (21) వెంకటేష్ (21) గా గుర్తించారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులుగా తెలుస్తోంది.. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 23, 2024

విజయనగరం: వాలంటీర్ సస్పెండ్

image

ఎన్నికల కోడు ఉల్లంఘనలో భాగంగా ఎల్కోట మండలం ఖాసాపేట సచివాలయం పరిధిలో క్లస్టర్-6 వాలంటీర్ బొబ్బిలి శివను తొలగించినట్లు ఎల్ కోట ఎంపీడీవో కే రూపేష్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మొబైల్‌లో రాజకీయ నాయకుల స్టేటస్లు పెడుతూ ప్రచారం చేస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు పై ఇతనిపై చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వేతనం తీసుకుంటున్న అందరికీ నిబంధన వర్తిస్తుంది అన్నారు.