Andhra Pradesh

News March 23, 2024

నెల్లూరు: వాలంటీర్‌పై కేసు నమోదు

image

నెల్లూరు జిల్లాలో ఓ వాలంటీర్‌పై కేసు నమోదైంది. కావలి మండలం ఆముదాల వలస వాలంటీర్ తాత ప్రవీణ్ ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎన్నికల నియమావళి నోడల్ అధికారి వెంకటేశ్వర్లు దృష్టికి వచ్చింది. విచారణ చేపట్టిన ఆయన వాలంటీర్‌పై కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 23, 2024

విశాఖ: నేడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన

image

మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు శనివారం విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 11.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సాగర్‌ నగర్‌లోని నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5గంటలకు నోవాటెల్ హోటల్‌కి వెళ్లి అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు. 24న తిరుగు ప్రయాణం కానున్నారు.

News March 23, 2024

గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు

image

గుంటూరు మిర్చియార్డుకు వరుసగా సెలవులు వచ్చాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవులతో పాటు సోమవారం హోలీ సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో యార్డులో 3 రోజులు పాటు క్రయవిక్రయాలు జరగవు. కర్ణాటకలో బాడిగ మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభం కావడంతో.. ఆ ప్రాంత రైతులు అక్కడికే సరకు తరలిస్తున్నారు. దీంతో శుక్రవారం ఒక్కసారిగా మిర్చియార్డుకు సరకు తగ్గింది.

News March 23, 2024

కడప: ఇఫ్తార్ విందుకు షర్మిల

image

ఈనెల 25న సాయంత్రం కడప జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో కడపలోని ఆమీన్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌లో ఇఫ్తార్‌ విందు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.తులసి రెడ్డి అన్నారు. ఈ ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్‌.షర్మిలారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. షర్మిల పర్యటన సందర్భంగా ఆయన ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లను పరిశీలించారు.

News March 23, 2024

అరసవిల్లి ఆలయ ప్రాంగణంలో వృద్ధుడి మృతి

image

నరసన్నపేటలోని మారుతీనగర్‌కు చెందిన ఉదండ్రావు వెంకట భాస్కరరావు(70) భార్య కృష్ణవేణితో కలిసి శుక్రవారం అరసవల్లి ఆలయానికి వచ్చారు. సెల్‌ఫోన్ డిపాజిట్ చేసి స్వామి దర్శనానికి క్యూలైనులోకి వెళ్లగా.. గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఆ వాహనం వచ్చేలోగా ఆర్ఎంపీ వైద్యుడిని పిలిచి చూపించగా.. అప్పటికే భాస్కరరావు మృతి చెందినట్లు తెలిపారు.

News March 23, 2024

కాకినాడ: జంటహత్యల కేసులో నిందితుడి అరెస్టు

image

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో జంట హత్యల కేసులో నిందితుడైన లోకా నాగరాజును అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపర్చినట్లు పిఠాపురం CI శ్రీనివాస్ తెలిపారు. బుధవారం అదే గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాస్, పెండ్యాల లోవాలపై పొలంలోనే నాగబాబు కత్తితో దాడి చేసి, హత్య చేశాడన్నారు. అనంతరం లోవ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించాడని CI పేర్కొన్నారు.

News March 23, 2024

గోనుగుంట్ల వర్గీయులపై దాడి.. ఆరుగురు అరెస్ట్

image

బత్తలపల్లిలో ఈ నెల 4న జరిగిన వాహనాలపై దాడి కేసులో టీడీపీకి చెందిన ఆరుగురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న పెనుకొండలో జరిగిన ‘రా.. కదిలి రా’ చంద్రబాబు సభకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ వర్గీయులు వెళ్తున్న వాహనాలపై బత్తలపల్లిలో టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరిచారని వెంగమనాయుడు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు శుక్రవారం అప్పస్వామి, కిరణ్, మోహన్ నాగరాజు, కాటమయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు

News March 23, 2024

నంద్యాల: బాలికను పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్.. కేసు

image

బేతంచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన గోరంట్ల మహేశ్ అనే యువకుడు గురువారం పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ శంకర్ నాయక్ తెలిపారు. గోరంట్ల మహేశ్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

News March 23, 2024

నెల్లూరు: 18 ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్టులను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. నగదు, మద్యంతో పాటు ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆయా చెక్ పోస్టుల్లో తనిఖీల పర్వం ప్రారంభమైంది.

News March 23, 2024

మార్చి 25న కోటప్పకొండ గిరి ప్రదక్షిణ

image

మార్చి 25 తేది సోమవారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం 5 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ సేవాసమితి అధ్యక్షులు అనుమోలు వెంకటచౌదరి మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఘాట్ రోడ్డు వద్ద విజయ గణపతి దేవాలయం వద్ద అల్పాహారం, మార్గమధ్యంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామన్నారు.