India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడి కల్ కళాశాలలో జరగనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన సాయి చైతన్య, హర్షిత, కె.హితలను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, కోచ్‌లు అనిల్ కుమార్ శర్మ, సతీష్ కుమార్, పి.అప్పలరాజు అభినందించారు.
విశాఖ జీవీఎంసీ 6వ వార్డ్ పీఎం పాలెం గాయత్రి నగర్‌లో చిల్ల సంతోష్ (27) అనే వ్యక్తి శుక్రవారం కరెంట్ షాక్‌కి గురై మృతి చెందాడు. గాయత్రి నగర్‌లోని ఓ భవనంలో ప్లంబింగ్ పని చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగిందని, స్థానికుల సమాచారం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా జామి మండలం చిల్లపాలెంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఈసారి TDP అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు మన అమలాపురం నుంచే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆయనే గంటి హరీశ్ మాధుర్(33). 12వ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దివంగత జీఎంసీ బాలయోగి-మాజీ ఎంపీ విజయకుమారి దంపతుల కుమారుడు హరీశ్‌కు అమలాపురం ఎంపీ టికెట్ ఖరారైంది. స్వగ్రామం ఐ.పోలవరం మండలం ఎదుర్లంక. BBM చదివిన ఈయన.. 2019లోనూ ఇక్కడే MPగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి మళ్లీ ఆయనే టికెట్ దక్కించుకున్నారు.
మండలంలోని పెనుమల్లం, రావిళ్లవారి కండ్రిగకు చెందిన ఇద్దరు వాలంటీర్లను శుక్రవారం విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో గిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా వాలంటీర్లు లత, గీత, ఆర్టీసీ కండక్టర్ మురళి పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో వాలంటీర్లను తొలగించడంతో పాటు మురళిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా ధ్వంసం చేశారు. అదేవిధంగా విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్‌కు చీపుర్లు కట్టి, ఏదో మంత్రం రాశారన్నారు. ఇది గమనించిన టీడీపీ నగర అధ్యక్షుడు ఆకులేటి మారుతి కుమార్ గౌడ్ శుక్రవారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ ధరణి కిషోర్ తెలిపారు.
మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి 2014, 2019లో TDP తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ఆయనకు కాదని ఈసారి రాఘవేంద్రరెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో తిక్కారెడ్డి వర్గం నిరసనలు చేపట్టింది. మూడో జాబితాలో అయినా తననే అభ్యర్థిగా ప్రకటిస్తారేమోనని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో తిక్కారెడ్డి TDPలోనే కొనసాగుతారా? లేక వేరే పార్టీలోకి వెళ్తారా అనే చర్చ నడుస్తోంది.
సర్వేపల్లి నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థుల మధ్యే పోరు జరగనుంది. 2014, 19 ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య రసవత్తర పోరు సాగనుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఇలా పాత ప్రత్యర్థులు ముఖాముఖి తలపడే అవకాశం లేకుండాపోయింది. ఒక్క సర్వేపల్లి అభ్యర్థులకే ఆ అవకాశం దక్కింది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం బందలాయిచెరువు గ్రామానికి చెందిన నలుగురు నేతలు ప్రస్తుత ఎన్నికల బరిలో దిగుతున్నారు. అంబటి రాంబాబు పల్నాడు(D) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన సోదరుడు అంబటి మురళి గుంటూరు(D) పొన్నూరు MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ MLA సింహాద్రి రమేశ్ బాబు మరోసారి పోటీకి సిద్ధం కాగా, సింహాద్రి చంద్రశేఖరరావు బందరు MP అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
గుంటూరులోని అమరావతి రోడ్డు వేలంగిని నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రచారం చేసి, ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యారంటూ టీడీపీ నేతలపై కేసు నమోదైంది. శుక్రవారం టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, సీనియర్ కోవెలమూడి రవీంద్ర ప్రచారం నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రచారం చేశారని వీరితో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 23, 25 తేదీల్లో సత్రాగచ్చి(SRC), సికింద్రాబాద్(SC) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23న నెం.07645 SC- SRC, ఈ నెల 25న నెం.07646 SRC- SC మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఏపీలో ఈ రైళ్లు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు విజయవాడ, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.