India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడిపత్రిలోని 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ప్రేమించి మోసం చేశాడని ఆరోపించిన అనూషపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణ పేర్కొన్నారు. కౌన్సిలర్ మల్లికార్జున తల్లి సావిత్రి, చెల్లెలు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపి అనూషపై 18న సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
విజయవాడలో శుక్రవారం భారీగా నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద రెండు కేజీల బంగారం, కిలోన్నర వెండి, కోటిన్నర నగదు పట్టుబడింది.ఎన్నికల నిబంధన మేరకు ఒక మనిషి రూ.50,000 మాత్రమే తీసుకొని వెళ్లాల్సి ఉంది. ఇది నగరంలోని ఓ బంగారు షాపుకు చెందినదిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు.
కదిరి మండలం కాళసముద్రంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు అనంతపురం డిపోకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మొత్తం 29,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,358 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 1036 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
ఎంపీలు సీబీఐ కేసులకు భయపడి ఏపీ హక్కుల కోసం పార్లమెంటులో పోరాటం చేయలేకపోతున్నారని విద్యార్థి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీశ్ మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జేఏసీ సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలు, ఏపీకి రావాల్సిన హక్కుల కోసం ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రాయపాటి జగదీశ్ స్పష్టం చేశారు.
కరువు మండలాల్లో తాగునీరు, ఉపాధి హామీ పనుల కల్పనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సత్యసాయి జిల్లా అధికారులతో మాట్లాడుతూ నీటి ఎద్దడి కల ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ అరుణ్ బాబుతో పాటు పలువులు పాల్గొన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఓ కొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు మహిళలు ఒక్కసారి కూడా గెలవ లేదు. అందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. అలాగే పూతలపట్టు, జీడీనెల్లూరు, శ్రీకాళహస్తిలో ఇంత వరకు మహిళలు గెలవ లేదు. మరోవైపు గళ్లా అరుణకుమారి, రోజా, గుమ్మడి కుతుహలమ్మ వంటి నేతలు మంత్రులుగా పని చేశారు.
ఉమ్మడి విజయనగరంలోని మొత్తం 9 నియోజకవర్గాల్లోని సాలూరు, బొబ్బిలి, నెల్లిమర్లలో ఇప్పటి వరకూ మహిళలు ఎమ్మెల్యేగా గెలవలేదు. బొబ్బిలిలో ఇప్పటి వరకూ మహిళా అభ్యర్థి పోటీచేయలేదు. నెల్లిమర్లలో కూడా ఇదే పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నెల్లిమర్లలో లోకం మాధవి పోటీచేస్తుంటే, సాలూరు నుంచి సంధ్యారాణి మూడోసారి పోటీచేస్తున్నారు. మరి వీరి గెలుపుపై మీ కామెంట్
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి సృజన హెచ్చరించారు. శుక్రవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీ విజిల్ ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే..సార్వత్రిక ఎన్నికల(2024)కు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ‘సి విజిల్’ యాప్ ద్వారా ఎన్నికల వేళ ఎవరు నిబంధనలు ఉల్లంగించిన ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
Sorry, no posts matched your criteria.