Andhra Pradesh

News March 22, 2024

ఎంసీసీని పటిష్టంగా అమలు: కలెక్టర్

image

ఎన్నికల కమీషన్ సూచనల మేరకు సాధారణ ఎన్నికలు – 2024 దృష్ట్యా జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి శుక్రవారం సాధారణ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై ఆయా శాఖల జిల్లా, మండల, క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.

News March 22, 2024

దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్‌పై సందిగ్ధత

image

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ భవిష్యత్త్‌పై సందిగ్ధత నెలకొంది. నేడు ప్రకటించిన టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉంటుందని అభిమానులు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూశారు. కానీ ఉమా పేరు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన దేవినేని ఉమాకు సీటు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చేస్తున్నారు.

News March 22, 2024

పల్నాడు: కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా జానీ

image

పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా దాచేపల్లికి చెందిన కరాలపాటి జానీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ అధ్యక్షులు తులసి రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జానీ శుక్రవారం దాచేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న తనను గుర్తించి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

News March 22, 2024

కాకినాడ: ఒకే కుటుంబం నుంచి 5గురు MLAలు

image

ప్రత్తిపాడు నియోజకవర్గానికి ‘పర్వత’ కుటుంబం ఐదుగురు MLAలను అందించింది. 1955లో పర్వత గుర్రాజు గెలవగా, ఆయన వారసుడు పర్వత సుబ్బారావు 1994లో గెలిచారు. సుబ్బారావు భార్య బాపనమ్మ 1999లో విజయం సాధించారు. ఆమె కుమారుడు పర్వత సత్యన్నారాయణ మూర్తి 2009లో గెలుపొందారు. అదే కుటుంబం నుంచి పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌కి 2019లో విజయం దక్కింది. దీంతో ఆ కుటుంబం నుంచి ఐదుగురు నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టినట్లయింది.

News March 22, 2024

విజయవాడ: సివిల్ సర్వీసెస్‌లో మహేశ్‌కు కాంస్య పతకం

image

న్యూ ఢిల్లీలో 18 నుంచి 22 వరకు జరిగిన అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో సిహెచ్. మహేశ్ కాంస్య పతకం సాధించాడు. మహేశ్ విజయవాడలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పవర్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సిబ్బంది, సహచరులు అభినందించారు.

News March 22, 2024

కందికుంట వెంకటప్రసాద్‌ను నిర్దోషిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు

image

కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. వెంకట ప్రసాద్‌పై గతంలో సీబీఐ, హైదరాబాద్ కోర్టు విధించిన ఐదు, ఏడు సంవత్సరాల శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇవాళ తీర్పు వెల్లడించింది. క్రిమినల్ ఆపిల్ నెంబర్ 454/2016, 1382/2017లను అనుమతిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన శిక్షణ హైకోర్టు రద్దు చేసింది.

News March 22, 2024

తిరుపతి: ఆన్‌లైన్‌లో వ్యవసాయ కోర్సులు

image

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పరిధిలో పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు మీడియం ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు angrau.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.

News March 22, 2024

కర్నూలు: ‘రెండు స్థానాలను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తాం’

image

కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కురువలకు కేటాయించడం పట్ల కురువ, వాల్మీకి సంఘ నాయకులు శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా కురువ కులస్థుడైన బస్తిపాటి నాగరాజు.. మంత్రాలయం అసెంబ్లీకి వాల్మీకి కులస్థుడైన రాఘవేంద్రరెడ్డికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు MP, మంత్రాలయం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు.

News March 22, 2024

అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీశ్.. నేపథ్యం ఇదే

image

టీడీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీశ్ మాధుర్ పోటీ చేయనున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. హరీశ్ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్లీ ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈయన జీఎంసీ బాలయోగి కుమారుడు.

News March 22, 2024

కురిచేడు: రైటు పట్టాలపై విద్యార్థిని డెడ్ బాడి

image

కురిచేడు మండలం దేకనకొండ గ్రామానికి చెందిన పి. భార్గవి (19) దర్శిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతుంది. గురువారం కాలేజికి బయలుదేరి వెళుతున్నానని చెప్పి వెళ్ళింది. మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించింది. భార్గవి తల్లిదండ్రులకు రైల్వే పోలీసులు సమాచారాన్ని అందించారు. ఇది ఆత్మహత్యనా లేక ప్రమాదమా అనే కారణాలు తెలియాల్సి ఉంది.