India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కురిచేడు మండలం దేకనకొండ గ్రామానికి చెందిన పి. భార్గవి (19) దర్శిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతుంది. గురువారం కాలేజికి బయలుదేరి వెళుతున్నానని చెప్పి వెళ్ళింది. మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించింది. భార్గవి తల్లిదండ్రులకు రైల్వే పోలీసులు సమాచారాన్ని అందించారు. ఇది ఆత్మహత్యనా లేక ప్రమాదమా అనే కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 25వ తేదీన స్వామివారికి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలలో తిరుమల లడ్డూలు స్వామివారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురానికి చెందిన దండు గోపాలకృష్ణ అనే వ్యక్తికి హత్యాయత్నం కేసులో 5ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా కోర్టు విధించినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. 2017లో అదే గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తిపై డబ్బుల విషయంలో హత్యాయత్నానికి పాల్పడడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణ అనంతరం జడ్జి జైలు శిక్ష జరిమాన విధిస్తూ తీర్పనిచ్చారు
అనంతపురంలోని రిలయన్స్ మార్ట్‌లో దోపిడీ చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపిన మేరకు.. గుజ్జల రుస్యింగులు, రాగిరి శ్రీనివాసులు, గొల్ల చంటి పట్టణంలోని రిలయన్స్ మార్ట్‌తో పాటు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వర్తకుడు ఇంట్లో చోరీ చేయాలని కుట్ర పన్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.
భర్త భార్యను హతమార్చిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామానికి చెందిన గంటా ముసలి నాయుడు భార్య అప్పలనరసమ్మపై కత్తితో దాడిచేయగా, ఆమె కడుపులో కత్తి దిగింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ముసలి నాయుడు పరారిలో ఉండడంతో కేసు నమోదుచేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించామని చెప్పారు.
మాజీ సీఎం చంద్రబాబు
ఈనెల 27 నుంచి 31 వరకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. సంబంధత పర్యటన వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈనెల 27న పలమనేరు, నగరి, మదనపల్లెలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 28న అనంతపురం, శ్రీసత్యసాయి, 29న కర్నూలు, నంద్యాల, 30న కడప, తిరుపతిలో, 31న నెల్లూరు, ఒంగోలులో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇవాళ టీడీపీ మూడో జాబితాలో చీరాల టికెట్‌ను కొండయ్యకు కేటాయించింది. ఇక దర్శి ఎమ్మెల్యే, ఒంగోలు ఎంపీ స్థానాలు పెండింగ్‌లో ఉంచాయి. దర్శి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గరికపాటి వెంకట్‌కు కేటాయిస్తారని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డికి టీడీపీ నుంచి ఇస్తారని టాక్.
ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి గురువారం అర్ధరాత్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ఆర్.ఎస్.నాయుడు బాబు విశాఖ పోర్ట్ అథారిటీలో దినసరి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. జీతం సరిపోక కుటుంబ పోషణ కష్టమవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. చేసిన అప్పులు తీర్చమని ఒత్తిళ్లు పెరగడంతో గురువారం అర్ధరాత్రి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అంబేడ్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన 20 మంది దళిత యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరే క్రమంలో శుక్రవారం పాలకొల్లులోని ఆయన ఇంటికి యలమంచిలి సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వెళ్లి హౌస్ అరెస్టు చేశారు.
Sorry, no posts matched your criteria.