India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. అటు వైసీపీ నుంచి కేశినేని నాని బరిలోకి దిగుతుండగా.. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తి నెలకొంది. కాగా 2022లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్ని తొలిసారి పోటీచేస్తున్నారు. అటు గత ఎన్నికలో టీడీపీ తరఫున పోటీచేసి నెగ్గిన నాని ఈసారి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలో విజయవాడలో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.
టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలును ప్రకటించారు. 2019లో ఆయన ఇదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇటీవల టీడీపీలో చేరగా.. ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ చేయనున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
TDP మూడో అభ్యర్థుల జాబితాలో.. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం MLA అభ్యర్థిగా గొండు శంకర్, పాతపట్నం నుంచి మామిడి గోవింద్ కుమార్, పలాస నుంచి గౌతు శిరీషా ఖరారయ్యారు. కాగా శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, MLA అభ్యర్థిగా వైసీపీ ధర్మాన ప్రసాద్ ఉన్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి, పలాసలో సిదిరి అప్పలరాజు బరిలో ఉన్నారు.
టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావును ప్రకటించారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన తొలిసారి ఎంపీ బరిలో నిలవనున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ కేటాయించినట్లు తెలుస్తోంది. అక్కడ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కురవ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఆయన 1996లో ఉమ్మడి అనంత జడ్పీ ఛైర్మన్‌గా, 1999లో హిందూపురం ఎంపీగా, 2009, 2014లలో వరసగా పెనుకొండ ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారయణ చేతిలో ఓడిపోయారు.
టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాడు నాగరాజును ప్రకటించింది. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.
చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండయ్యను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించారు. బాపట్ల జిల్లాలో చీరాల ఒక నియోజకవర్గాన్ని పెండింగ్లో పెట్టిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విడుదల చేసిన జాబితాలో చీరాల సీటును కొండయ్యకు ఖరారు చేశారు. ఇక వైసీపీ నుంచి కరణం వెంకటేశ్ పోటీ చేయనున్నారు.
ఎట్టకేలకు సర్వేపల్లి టీడీపీ టికెట్‌పై ఉత్కంఠ వీడింది. ఇటీవల సర్వేపల్లిలో కొత్త అభ్యర్థి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టు ఐవీఆర్ కాల్స్‌లో సోమిరెడ్డితో పాటు మరికొందరు పేర్లు వినించాయి. ఎట్టకేలకు సోమిరెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. మూడో జాబితాలో ఆయన పేరు ఖరారు చేయడంతో కాకాణితో మరోసారి తలపడనున్నారు. మరోవైపు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డిని అధికారికంగా డిక్లేర్ చేశారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పులు జరిగాయి. తమ అధినేత పర్యటన ఒక్క రోజు వాయిదా పడినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 24, 25న బదులు.. 25, 26న కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మార్పులు గమనించాలని ఆయన కోరారు.
తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని నెల్లూరు MP అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. ‘నేను ఎక్కడి నుంచో రాలేదు. నేను నెల్లూరు బిడ్డనే. ఇక్కడే పుట్టి ఇక్కడే చదివా. విజయవాడ, విశాఖ, ఢిల్లీ వెళ్లినా నెల్లూరు సమస్యల పరిష్కారానికి కృషి చేశా. ప్రత్యర్థి లాగా ఇండోనేషియా, దుబాయ్‌లో నాకు వ్యాపారాలు లేవు. మాట ప్రకారం నెల్లూరు 47వ డివిజన్ స్వర్ణకారులకు 500 షాపులు నిర్మిస్తా’ అని ఆయన హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.