India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల వైసీపీలో చేరిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వారు ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో తన గెలుపు కోసం సహకరించాలని ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేను కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం.సుహాసిని గంపలగూడెంలోని చౌటపల్లి, ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పులు నిర్వహణ తీరు, లక్ష్యాల సాధనకు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు. పి.హెచ్.సిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరు పర్యవేక్షించారు. పీహెచ్సీలో కాన్పులు చేయని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి పక్కాగా ఎన్నికల నిర్వహణ చేయాలని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలలో పలు కొత్త అంశాలు, సూచనలు ఉన్నాయని, పూర్తిగా పీ.ఓ హ్యాండ్ బుక్ చదివి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడు ఎన్నికల నిర్వహణ సులువు అవుతుందని అన్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే సీటు కేటాయింపు విషయంలో గందరగోళం నెలకొంది. కొంతకాలం వరకు జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు టికెట్ ఇస్తున్నారని, అలాగే టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాసులకు సీటు కేటాయిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వేలలో కొత్త అభ్యర్థుల పేర్లు వినిపించడంతో టీడీపీ, జనసేన నాయకుల్లో టెన్షన్ నెలకొంది.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అబ్జర్వర్లు, ఎన్నికల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు కనీసం 48 గంటల ముందుగా అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎన్నికల నిబంధనలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. పత్తికొండ సబ్ డివిజన్, రాతన, తుగ్గలి, జొన్నగిరి గ్రామాలలో కవాతు నిర్వహించారు. పత్తికొండ రూరల్ సీఐ వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తుగ్గలి SI బి.మల్లికార్జున, జొన్నగిరి ఎస్సై రామాంజనేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో కూడా నిర్వహించారన్నారు.
ఉంగుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ప్రస్తుత అభ్యర్థి పుప్పాల వాసుబాబు, జనసేన- టీడీపీ- బీజేపీ కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఒకే వేదికపై కనిపించారు. నిడమర్రు మండలం
పెదనిండ్రకొలను రథోత్సవంలో వీరిద్దరూ వాహనంపై ఎక్కి పూజలు నిర్వహించారు. వారితో పాటే మాజీ MLA గన్ని వీరాంజనేయులు కూడా ఉన్నారు. ముగ్గురు నాయకులు పరస్పరం అభివందనం చేసుకుని భక్తి కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యత చోటుచేసుకుంది.
ఏపీలో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బి.సత్యనారాయణ తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలోని లాసెట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, వీసీతో కలిసి నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు.
రామ్ చరణ్, కాజల్, అమలాపాల్ నటించిన ‘నాయక్'(2013) సినిమా ఈ నెల 23, 24వ తేదీల్లో రీరిలీజ్ అవ్వనుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ G3 థియేటర్‌లో విడుదల కానుంది.’నాయక్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమాలోని పాటలు, సీన్స్ పోస్ట్ చేస్తున్నారు.
కడప రైల్వే స్టేషన్ లో ప్రొద్దుటూరుకు చెందిన షేక్ జాఫర్ అనే వ్యక్తి వద్ద నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కడప రైల్వే ఇన్స్పెక్టర్ నాగార్జున తెలిపారు. రైల్వే స్టేషన్‌లో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా జాఫర్ అనుమానాస్పదంగా కనిపించాడని తెలిపారు. ఒక్కొక్కటి రెండు కిలోలు చొప్పున నాలుగు కిలోలు గంజాయి బండిల్స్ ఉన్నాయని తెలిపారు. గుంతకల్లు రైల్వే కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.