India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోటబొమ్మాళి మండలం విశ్వనాధపురం గ్రామంలోని ఓ కొండ సమీపంలో గురువారం గుర్తుతెలియని అస్థిపంజరం గ్రామస్థుల కంటపడింది. దీంతో గ్రామస్థులు స్థానిక వీఆర్వో పైల దాలప్పకు సమాచారం ఇవ్వటంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలు గురయ్యారు.
తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని జయనగర్ కాలనీకి చెందిన రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బైక్ డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తవణంపల్లిలో చోటుచేసుకుంది. SI సుధాకర్ రెడ్డి వివరాల మేరకు.. చిత్తూరులోని కట్టమంచి కంది కాలమ్మ గుడి వీధికి చెందిన రామన్ (60) బైక్‌పై వెళ్తుండగా కె. పట్నం ఫ్లైఓవర్ వద్ద అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అతని భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.
రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో మార్గదర్శకాలు ఉల్లంఘించిన 23 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు రాజమండ్రి అర్బన్ రిటర్నింగ్ అధికారి/మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగులు కచ్చితంగా ఎన్నికల నియమావళిని అనుసరించాలని తెలిపారు. స్థానిక 44వ వార్డు పరిధిలోని సచివాలయం 76, 77లకు చెందిన వాలంటీర్లు సస్పెన్షన్ కు గురయ్యారు.
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు పంచాయితీలోని కోడాపల్లిలో ఘోరం జరిగింది. గ్రామానికి చెరుకు చంద్రరావు, జానకి దంపతుల ఏడాదిన్నర కుమారుడు గణేష్ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి మృతి చెందాడు. తొట్టిలో పడిన బాలుడిని దేవరాపల్లి పీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.
త్రిపురాంతకం మండలం రాజుపాలెంకు చెందిన గంపసాని సింహాద్రి (20) ఇటుకల బట్టీలో ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గురువారం ఇటుకల లోడు ట్రాక్టరును తీసుకుని త్రిపురాంతకం వస్తున్న క్రమంలో చెరువు చప్టాపై స్పీడ్ బ్రేకర్ వద్ద ఆదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఇటుకలు సింహాద్రిపై పడ్డాయి. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీసి వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పొన్నూరు మండలం మాచవరం గ్రామం తుంగభద్ర డ్రెయిన్ కట్టపై గురువారం పొన్నూరు రూరల్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై బండ్ల భార్గవ్ ఆధ్వర్యంలో కోడి పందేల స్థావరాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, 6 కోడిపుంజులతో పాటు 16 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్సై భార్గవ్ మీడియాకు తెలిపారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో మహిళా అభ్యర్థులు పోటీ చేసినా.. గెలిచిన దాఖలాలు లేవు. 1983లో కాంగ్రెస్ నుంచి M.లక్ష్మీకాంతమ్మ పోటీ చేయగా..TDP అభ్యర్థి S.ప్రకాశం చేతిలో ఓడిపోయారు. 2009లో V.సరస్వతి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా..TDP అభ్యర్థి పరసా వెంకటరత్నం చేతిలో ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో TDP తరఫున నెలవల విజయశ్రీ.. వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తున్నారు. విజయశ్రీ గెలిచి రికార్డు సృష్టిస్తారా?
ప్రేమ విఫలమై మహేష్ (19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లి మండలం, బి.ఎర్రగుడి గ్రామం, కాపుపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు హుటాహుటిన లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.