Andhra Pradesh

News March 21, 2024

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆమె ఐదుసార్లు ఎమ్మెల్యే?

image

ఎచ్చెర్ల నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. నేటి రోజుల్లో హ్యాట్రిక్ కొట్టడమే గగనంగా మారింది. అలాంటిది ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కె.ప్రతిభా భారతి టీడీపీ తరఫున 1983 నుంచి 2004 వరకు పోటీ చేసి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించింది. పోటీ చేసిన ప్రతిసారి 10 వేలకుపైగానే మెజార్టీతో గెలుపొందారు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటి మహిళ స్పీకర్ గా పనిచేశారు.

News March 21, 2024

అమలాపురం MP చింతా అనురాధ పార్టీ మార్పు.. క్లారిటీ

image

తాను వైసీపీ నుంచి వేరే పార్టీలోకి మారుతున్నట్లు ప్రచారం సాగుతుందని ఇది పూర్తిగా అవాస్తవం అని అమలాపురం MP చింతా అనురాధ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంలో సీఎం జగన్ చేసిన సాయం మరువలేనిదన్నారు. అటువంటి వ్యక్తి నీడలోనే పని చేస్తాను తప్ప మరో గూటికి చేరే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు.

News March 21, 2024

ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి: మన్యం కలెక్టర్

image

సి.విజల్ యాప్‌లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరులు కోడ్ ఉల్లంఘన సంబంధించి చర్యలు గుర్తించిన వెంటనే సి.విజల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. నమోదు చేసిన 100 నిమిషాల్లో స్పందించాలనిక సిబ్బందికి సూచించారు.

News March 21, 2024

పాచిపెంట మండలంలో 11 మంది వాలంటీర్లు తొలగింపు

image

పాచిపెంట మండలం పాంచాలి సచివాలయం పరిధిలో పని చేస్తున్న 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ ఉన్నం లక్ష్మి కాంత్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19న రాజకీయ పార్టీలు కార్యకలాపాలలో పాల్గొన్నట్లు గుర్తించి.. సాలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు మేరకు వారిని విధుల నుంచి తొలగించామన్నారు.

News March 21, 2024

ధర్మవరంలో యువకుడి ఆత్మహత్యాయత్నం

image

ధర్మవరం పట్టణం ఇందిరానగర్‌కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పి వంశీకృష్ణను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వంశీకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2024

రేపు నెల్లూరు జిల్లాకు చంద్రబాబు రాక

image

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దర్శనానికి వస్తారని జిల్లా టీడీపీ నాయకులు తెలిపారు. రేపు హైదరాబాదు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో 1:00 కు బయలుదేరి రాపూరు(మం) గోనుపల్లిలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 3.15 వస్తానన్నారు. అక్కడనుంచి కారులో స్వామివారిని దర్శించుకుంటారు. తిరిగి ఉండవల్లికి వెళ్తారన్నారు.

News March 21, 2024

24, 25న తుంబురుతీర్థ ముక్కోటి

image

తిరుమల శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24, 25న జరుగనుంది. తీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తుంబురు తీర్థంలోకి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు.. మ‌రుస‌టి రోజు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్ర‌మే భక్తులను అనుమతిస్తారు.

News March 21, 2024

వై.పాలెం: గ్రామ సేవకుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మృతి

image

గ్రామ సేవకుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుర్రం నాగయ్య గురువారం మృతి చెందారు. బుధవారం సాయంత్రం నాగయ్య తన ఇంటి ముందు రోడ్డు దాటుతుండగా మోటారు సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామ సంఘం నాయకులు సంతాపం తెలిపారు.

News March 21, 2024

పాతపట్నం: ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ గురువారం పాతపట్నం మండలంలో పర్యటించారు. పాతపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికలు సజావుగా సాగేందుకు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎన్నికల్లో అవలంబించిన విధివిధానాలను అధికారులకు వివరించారు.

News March 21, 2024

కర్నూలు జిల్లాలో TDP ఒక్కసారి మాత్రమే గెలిచిన స్థానం ఇదే..

image

కోడుమూరు నియోజవకర్గానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో TDP ఒక్కసారి మాత్రమే గెలిచింది. 1962లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పీఆర్ రావుపై కాంగ్రెస్ అభ్యర్థి డీ.సంజీవయ్య విజయం సాధించారు. మొత్తం 8సార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే.. 1983లో తొలిసారి బరిలో నిలిచిన TDP పరాజయం పాలైంది. 1985లో TDP అభ్యర్థి ఎం.శిఖామణి మాత్రమే విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో గెలుస్తుందో లేదో కామెంట్ చేయండి.