Andhra Pradesh

News March 21, 2024

బాపట్ల: ఆంగ్ల పరీక్షకు 95 శాతం హాజరు

image

పదో తరగతి ఆంగ్ల పరీక్షకు జిల్లాలో 108 కేంద్రాల్లో 16,952 మంది హాజరు కావాల్సి ఉంది. అందులో 16,424 హాజరు కాగా 528 మంది గైరాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అద్దంకి, చీరాలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 28కేంద్రాల్లో విద్యార్థులను తనిఖీ చేశారు. 

News March 21, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కి షాక్

image

విశాఖ ఉక్కును విద్యుత్ బిల్లుల గండం మరింత భయపెడుతోంది. బాయిలర్ బొగ్గు కొరతతో ప్లాంట్‌లోని 315 మెగావాట్ల సొంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్‌ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.60 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ ఈపీడీసీఎల్ హెచ్చరిస్తూ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.

News March 21, 2024

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రత్యేక చెక్‌ పోస్ట్

image

ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాలు తనిఖీ చేసేందుకు ప్రత్యేక చెక్‌ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల సరిహద్దులో ప్రకాశం బ్యారేజ్ చెక్ పోస్ట్ కీలకమైందన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే వదిలేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటారని చెప్పారు. 

News March 21, 2024

విజయవాడ: ఇన్విజిలేటర్‌కు దొరికిన నకిలీ విద్యార్థి

image

ఓపెన్ టెన్త్ పరీక్షల్లో.. ఒక విద్యార్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డారు. దీంతో పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ విజయలక్ష్మి అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతారామయ్య అనే విద్యార్థికి బదులు జోసెఫ్ అనే విద్యార్థి పరీక్ష రాస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. 

News March 21, 2024

పొందూరు: కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌పై నిబంధనల ఉల్లంఘన కేసు

image

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రామారావు‌పై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పొందూరు మండలం తోలాపి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈనెల 17న రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఆత్మీయ సభ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎంగా తన అనుమతి లేకుండా సభ నిర్వహించినట్లు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం, ఎంపీడీవోల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రవికుమార్ తెలిపారు.

News March 21, 2024

కర్నూలు: వరుసగా 5సార్లు MLA.. 3సార్లు ఓటమి

image

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీవీ మోహన్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. నియోజకర్గంలో 8సార్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అందులో 1983 నుంచి 1999 వరకు వరుసగా 5సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి 2012 వరకు వరుసగా చెన్నకేశ్వరెడ్డి చేతిలో 3సార్లు ఓటమిపాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర గౌడ్‌పై 28904 అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది.

News March 21, 2024

రాయదుర్గం: ఇరువర్గాల ఘర్షణ..13 మందిపై కేసు 

image

రాయదుర్గం రూరల్‌ మండల పరిధిలోని కొంతానపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఇరు వర్గాల ఘర్షణలో 13మందిపై కేసు నమోదుచేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. పొలం విషయంలో కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి  దాడులు చేసుకున్నారన్నారు. ఇరు వర్గాల దాడిలో పలువురు గాయపడ్డారు. పరస్పర ఫిర్యాదుల మేరకు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 21, 2024

ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం: కలెక్టర్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకునేందుకు  జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ 0863-2234301 నంబరుకు ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని పేర్కొన్నారు. 

News March 21, 2024

ప్రకాశం: అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు

image

జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ఓ మైనర్ బాలికను అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అతడికి 10 జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జరుగుమల్లి మండలం నందనవనానికి చెందిన మిడసాల శివకృష్ణ(32) 2014లో హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో 13 ఏళ్ల బాలికను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా పదేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News March 21, 2024

పిడుగురాళ్ల: రైలు కింద పడి మహిళ మృతి

image

రైలు కిందపడి మహిళ మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల మండల పరిధిలోని జానపాడు రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం మాచర్ల ప్యాసింజర్ రైలు వస్తున్న సమయంలో గుర్తుతెలియని మహిళ రైలు కిందపడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.