Andhra Pradesh

News March 20, 2024

విజయవాడ: పవర్ లిఫ్టింగ్‌లో శ్రీదేవికి కాంస్య పతకం

image

న్యూ ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో ఎన్.శ్రీదేవి కాంస్య పతకం సాధించింది. శ్రీదేవి విజయవాడలోని కేసరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవిని పలువురు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, సహచర అధ్యాపకులు అభినందించారు.

News March 20, 2024

పిఠాపురంలో లక్ష ఓట్లు కూడా పవన్‌కి రావు: వెల్లంపల్లి

image

గతంలో గాజువాక, భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారని అతనికి ఓటమి కొత్త ఏమి కాదని వైసీపీ సెంట్రల్ ఇన్‌ఛార్జ్ వెల్లంపల్లి అన్నారు. నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో లక్ష మెజార్టీ కాదు లక్ష ఓట్లు కూడా పవన్‌కి పడతాయా అని ఎద్దేవా చేశారు. అనంతరం చంద్రబాబు, లోకేశ్ వారి నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తుంటే పవన్‌ని ఎందుకు మార్చారో చెప్పాలన్నారు.

News March 20, 2024

MP, MLA అభ్యర్థులకు నంద్యాల కలెక్టర్ కీలక ఆదేశాలు

image

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో MP, MLA అభ్యర్థులకు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు MP అభ్యర్థి రూ.95 లక్షలు, MLA అభ్యర్థి రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రశాంతమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కొరకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్ డా.శ్రీనివాసులు కోరారు.

News March 20, 2024

పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు : వంగా గీత

image

జనసేనలోకి పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీతను, పవన్ కళ్యాణ్ ఆహ్వానించడంపై ఆమె స్పందించారు. పవన్ కళ్యాణ్‌వి దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేశారు. ‘నేను కూడా పవన్ కళ్యాణ్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది’ అని మండిపడ్డారు. పిఠాపురంలో కేవలం ‘నా మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి’అని ధీమా వ్యక్తం చేశారు.

News March 20, 2024

పెనమలూరు కూటమి అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్?

image

పెనమలూరు TDP-జనసేన-BJP కూటమి MLA అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్‌ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ నారా లోకేశ్‌కి అత్యంత సన్నిహితుడు. ఇప్పటికే అధిష్ఠానం IVRS సర్వే కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. యువగళం సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈయనకే ఈసారి టికెట్ ఇస్తారని విశ్వసనీయ సమాచారం.

News March 20, 2024

పవన్ కళ్యాణ్‌పై MLA ద్వారంపూడి విమర్శలు

image

పవన్ కళ్యాణ్‌పై MLA ద్వారంపూడి పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన MLA గా పోటీ చేయాలంటే చంద్రబాబు,MPగా పోటీ చేయాలంటే అమిత్ షా అనుమతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీకి అధినేత అయి ఉండి కూడా ఇటువంటి స్థితిలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. పిఠాపురంలో కాపు సమాజిక వర్గం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌పై ప్రజలకు విశ్వాసం లేదని విమర్శించారు.

News March 20, 2024

చిత్తూరు: గెలిపిస్తారా.. షాక్ ఇస్తారా?

image

ప్రత్యర్థుల బలహీనతల కంటే సొంత పార్టీలోని అసమ్మతి నేతల తీరుపైనే విజయావకాశాలు ఉంటాయి. నగరిలో రోజాను YCP నేతలే వ్యతిరేకించినా ఆమెకే జగన్ టికెట్ ఇచ్చారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు వద్దని జనసేన, టీడీపీ నేతలు బాహటంగా చెబుతున్నారు. సత్యవేడులో ఆదిమూలాన్ని మార్చాలని, తంబళ్లపల్లెలో శంకర్‌కు టికెట్ ఇవ్వాలని నేతలు చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆయా చోట్ల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

గుంటూరుకి చేరిన CRPF బలగాలు

image

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం గుంటూరు రైల్వే స్టేషన్‌కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. గుంటూరు నగరంలో వారు బస చేయడానికి పరీక్షలు అయిపోయి ఖాళీగా ఉన్న ఇంటర్ కాలేజీలను కేటాయించారు. 650 మంది సిఆర్పిఎఫ్, 425 మంది ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు.

News March 20, 2024

యలమంచిలి: ట్రాక్టర్‌ని ఢీకొన్న బస్సు.. వ్యక్తి మృతి

image

యలమంచిలి మండలం పులపర్తి హైవే జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం వొమ్మవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షేక్ మీరా సాహెబ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు.

News March 20, 2024

ఎన్నికల కోడ్ అమలు బాధ్యత రిటర్నింగ్ అధికారులదే : కలెక్టర్

image

అనంత :కేంద్ర ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు కోడ్ అమలు బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధిత రిటర్నింగ్ అధికారులదేనని జిల్లా ఎన్నికలు అధికారి కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోడ్లకు ఇరువైపులా, బస్టాండ్ రైల్వే స్టేషన్ బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి రాజకీయ పరమైన హోర్డింగ్‌లు పోస్టర్స్ ఉన్న వెంటనే వాటిని తొలగించాలన్నారు.