India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, ఆ దేశ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మంగళవారం వసతిగృహ విద్యార్థినులతో సందడి చేశారు. సంచయిత గజపతిరాజు ఆధ్వర్యంలో పరదేశిపాలెం సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన సుజలధార, హరిత బయో టాయ్‌లెట్లను ప్రారంభించారు. అంతకు ముందు గిరిజన విద్యార్థినులంతా థింసా నృత్యంతో స్వాగతం పలికారు.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన బీటెక్ మూడో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు అధికారులు ఆచార్య కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఎంఫార్మసీ మూడో సెమిస్టర్, ఫార్మాడీ ఒకటి, రెండు, మూడో సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశామన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ముద్రించిన 1.11 లక్షల ఓటరు ఎపిక్ కార్డులు చిత్తూరు కలెక్టరేట్‌కు చేరాయి. ఈనెల 17న 81 వేలు, ఈనెల 18న 30 వేలు మొత్తం 1.11 లక్షల కార్డులు వచ్చినట్టు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. వీటిని స్కాన్ చేసి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు పంపారు. ఆ శాఖ నుంచి జిల్లాలోని సంబంధిత ఓటర్ల చిరునామాకు పోస్టు ద్వారా చేరవేయనున్నారు.
ఎద్దుల బండిని కారు ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. హిందూపురం వైపు నుంచి కొట్నూరు వెళుతున్న ఎద్దుల బండిని కారు ఢీకొని ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిలో ఉన్న ఒక యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 943 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అధికారులు తెలిపారు. హిందీ పరీక్ష రెగ్యులర్‌కు సంబంధించి 28,280 మందికి గాను 27,722 మంది పరీక్షలు రాశారు. ప్రైవేట్‌కు సంబంధించి 490 మంది విద్యార్థులకు గాను 385 మంది గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలు పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఆయన మంగళవారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాలు, వాణిజ్య స్థలాల్లో ఎలాంటి రాజకీయ ప్రకటనల హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని సూచించారు. ఈ కాన్ఫరెన్స్ కలెక్టర్ సృజన పాల్గొన్నారు.
యలమంచిలి మండలం మట్టావానిచెర్వులో ఆరు డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన రూ.5.62 లక్షలు వీఓవో తన సొంత ఖర్చులకు వినియోగించుకున్న ఘటన వెలుగులోకొచ్చింది. కాగా గ్రూపు సభ్యులు బ్యాంకును సంప్రదించగా విషయం బయటపడింది. దీంతో సభ్యుల ఫిర్యాదు మేరకు ఏపీఎం విచారణ జరిపి రూ.4.62 లక్షలు వసూలు చేయగా మిగిలిన డబ్బు బుధవారం చెల్లిస్తామని చెప్పినట్లు సమాచారం.
విశాఖ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 31న జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు జట్ల ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌరభ్ గంగూలి, డేవిడ్ వార్నర్, షఫాలీ వర్మ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లారు. సాయంత్రం ఏసీఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
చదువులో ఫెయిల్ అవడంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకొన్న ఘటన డెంకాడ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మండలానికి సమీపంలో ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న షేక్ లాల్ మాజక్ (21) కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. వాళ్ల నాన్నతో ఫోన్‌లో మాట్లాడి, అనంతరం జొన్నడ సమీపంలో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జిల్లాలో పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. తదనుగుణoగా ఇతర రాష్ట్రాల నుండీ లిక్కర్, డబ్బు, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు జిల్లాలోకి రాకుండా కర్నాటక సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ చెక్ పోస్టులో నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.