Andhra Pradesh

News March 20, 2024

లక్షకు పైగా నగదు లావాదేవీలు జరిపిన వారి వివరాలు తెలపండి

image

కలెక్టర్ కార్యాలయం నందు బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లక్ష రూపాయలకు పైగా నగదు లావాదేవీలు జరిపిన వారి వివరాలు ప్రతిరోజూ అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ ప్రదీప్, ఎన్నికల ఖర్చు మోనిటరింగ్ నోడల్ అధికారి విద్యాసాగర్, బ్యాంక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News March 20, 2024

అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచండి: కృష్ణా కలెక్టర్

image

ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ జిల్లాలో కోడ్ అమలులో ఉందన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచి వాటి వివరాలను పంపాలన్నారు. ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఎక్కువ మందికి సొమ్ము జమ అవుతుంటే ఆ వివరాలను తెలియజేయాలన్నారు.

News March 19, 2024

వైజాగ్ అందాలు అద్భుతం: యూఎస్ రాయబారి

image

టైగర్‌ ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ వచ్చిన భారత్‌లో యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ దంపతులు మంగళవారం కైలాసగిరిని సందర్శించారు. అక్కడి నుంచి విశాఖ అందాలను చూసి మంత్ర ముగ్ధులై ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ‘కైలాసగిరి నుంచి వైజాగ్‌ అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత ప్రాంతాన్ని సంరక్షిస్తూ మరింత అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దిన GVMCకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

News March 19, 2024

NTR: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు గమనిక

image

ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ట్రైన్ నెం.22701 విశాఖపట్నం- గుంటూరు, నెం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌లను ఏప్రిల్ 1 నుంచి 28 వరకూ రద్దు చేస్తున్నట్లు, రైల్వే వర్గాలు తాజాగా పేర్కొన్నాయి.

News March 19, 2024

అనకాపల్లి ఎంపీ సీటు ఖరారుకు ఇంకా సమయముంది: వైవీ

image

అనకాపల్లి ఎంపీ సీటు ఖరారు చేసేందుకు ఇంకా సమయం ఉందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. మంగళవారం విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.

News March 19, 2024

నందిగామ: ఘనంగా నూతన కోర్టు భవనాలు ప్రారంభం

image

నందిగామలోని కోర్టు కాంప్లెక్స్ లో నూతన సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, అడిషనల్ జూనియర్ జడ్జి కోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఎన్టీఆర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ శేష సాయి, హైకోర్టు జడ్జిలు కృపాసాగర్, గోపాలకృష్ణ మండేల పాల్గొని ప్రారంభించారు.

News March 19, 2024

శ్రీకాకుళం: ఓపెన్ టెన్త్ పరీక్షలకు 11 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ టెన్త్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. మొత్తం 79 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 68 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 11 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

News March 19, 2024

నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

image

నెలవారీ నేర సమీక్షా సమావేశం నెల్లూరులోనే ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి నిర్వహించారు. జిల్లాలో చోటు చేసుకున్న, పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్థి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జీరో-వయోలెన్స్, జీరో-రీపోలింగ్ తో సార్వత్రిక ఎన్నికల నిర్వహణే ధ్యేయమన్నారు.

News March 19, 2024

భీమిలిలో చెడ్డీ గ్యాంగ్ ఫొటోలు విడుదల

image

భీమిలి పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా తిరుగుతున్నారని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. ఈ మేరకు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి పూట గ్రామాలలో తిరుగుతున్నారని, అనుమానం రాకుండా ప్రజల మధ్యలో ఉంటున్నారు.. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News March 19, 2024

భీమిలిలో చెడ్డీ గ్యాంగ్ ఫొటోలు విడుదల

image

భీమిలి పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా తిరుగుతున్నారని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. ఈ మేరకు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి పూట గ్రామాలలో తిరుగుతున్నారని, అనుమానం రాకుండా ప్రజల మధ్యలో ఉంటున్నారు.. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.