India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రొళ్ల మండలం కాకి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శివన్న, రాధమ్మ దంపతుల కుమార్తె మేఘన (19) మంగళవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రొళ్ల ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిరకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెందుర్తి టికెట్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బండారుకు మద్దతుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెన్నెలపాలెం నుంచి పరవాడ వరకు పాదయాత్ర చేపట్టారు. బండారు టికెట్ ఇవ్వని పక్షంలో జనసేన అభ్యర్థికి సహకరించేది లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా చేసిన ఒక సీనియర్ నేతకు టికెట్ ఇవ్వకుండా అవమానించడం సమంజసం కాదన్నారు.
కోటవురట్ల మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఇసరపు రామకృష్ణ (25) కోటవురట్లలో మంగళవారం నాలుగు అంతస్తుల భవనం నిర్మాణ పనులు చేస్తూ అదుపుతప్పి కిందకు జారిపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతునికి మూడు నెలల క్రితమే వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
గుంటూరు రైల్వేస్టేషన్లో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై జీఆర్పి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పై మంగళవారం ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నాడనే సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుని చేతికి సెలైన్ ఎక్కించుకున్న బ్యాండేజ్ ఉంది. మృతుడి వివరాలు తెలియరాలేదని, గుర్తుపట్టినవారు జీఆర్పి పోలీసులను సంప్రదించాలన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండవద్దని ఆయన సూచించారు. పిడుగులు పడే సమయంలో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో అధికారులు మంగళవారం ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమెకు పెళ్లి చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ఇంటికి వెళ్లి అడ్డుకున్నామని జిల్లా బాలల సంరక్షణాధికారి డా.సీహెచ్ సూర్య చక్రవేణి తెలిపారు. అనంతరం బాల్య వివాహల వలన కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు వివరించినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 15 ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లను తొలగించినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 314 విగ్రహాలకు ముసుగులు తొడిగామని, 38 హోర్డింగ్‌లు, 14,540 పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించామన్నారు. ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.
సింహాచలం ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించనున్న చందనోత్సవం పై మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఈఓ శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను వివరించారు. ముఖ్యంగా కొండపైన ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు క్యూలైన్ల ఏర్పాటు తదితర విషయాలపై అధికారులతో ఈఓ చర్చించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు.
TDP ఆవిర్భావం నుంచి NTR కష్టసుఖాలలో వెంట నడిచిన నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈయన రాజమండ్రి, రూరల్ నుంచి MLA అభ్యర్థిగా 9సార్లు బరిలో నిలిచి, 6సార్లు (1983, 85, 1994, 99, 2014, 19) గెలిచారు. రూరల్‌లో 2014, 19 ఎన్నికలలో వరుసగా గెలిచిన గోరంట్ల.. ఈసారి వైసీపీ నుంచి చెల్లుబోయిన వేణుతో తలపడుతున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని గోరంట్ల.. గోరంట్లకు కళ్లెం వేయాలని వేణు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.