Andhra Pradesh

News March 19, 2024

కర్నూలు: వైసీపీ MLA అభ్యర్థుల్లో వీరే చిన్నోళ్లు

image

కర్నూలు జిల్లాలో 14మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులను వైసీపీ అదిష్ఠానం ప్రకటించింది. వీరిలో 1988లో జన్మించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి అందరికంటే వయస్సులో చిన్నవారు. ఆయన తర్వాత స్థానంలో 1988లో జన్మించిన నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. అందరి కంటే ఎక్కువ వయస్సు కల్గిన అభ్యర్థిగా 1954లో జన్మించిన నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.

News March 19, 2024

శ్రీకాకుళం జిల్లాలో రేపు భారీ వర్షాలు

image

ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా.. పశ్చిమ విదర్భ వివిధ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీంతో ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

News March 19, 2024

చిత్తూరు: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ …. ఆ సేవలు బంద్

image

ఈసీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ కేంద్రాలలో వివిధ సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ధ్రువపత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం ఫొటో లేని కొత్త స్టేషనరీ వచ్చేవరకు ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయొద్దని అధికారులు స్పష్టం చేశారు.

News March 19, 2024

వెంకటగిరి: వరకట్న వేధింపు కేసులో ఉపాధ్యాయునికి మూడేళ్ల జైలు

image

ప్రభుత్వ ఉపాధ్యాయుడైన చెవిరెడ్డి సుధాకర్ రెడ్డి 2011లో స్వప్నను పెళ్లి చేసుకున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని 2017లో ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారించిన వెంకటగిరి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించినట్లు ఏపీపీ ప్రకృతి కుమార్ తెలిపారు.

News March 19, 2024

జామి: మైనర్‌పై దాడి నిందుతుడికి జైలు శిక్ష

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఏడేళ్ల జైలు, రూ.3,500 జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం సోమవారం తీర్పు ఇచ్చిందని విజయనగరం SP దీపిక ఎం.పాటిల్ తెలిపారు. జామి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఆబోతుల సత్తిబాబు (45) మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా బాలిక తల్లి 20 సెప్టెంబర్ 2023న పిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన కోర్ట్ నిందుతుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని SP తెలిపారు.

News March 19, 2024

పులివెందుల: టైంకు అన్నం పెట్టలేదని హత్య

image

అన్నంలోకి కూరలు సకాలంలో తీసుకురాలేదని కోపంతో రెడ్డి బాబును(15) అతని చిన్నాన్న సురేశ్ దాడి చేసి హత్య చేశాడు. సురేశ్‌కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఒక రూములో ఉంచి రోజు భోజనాలు పెట్టేవారు. సోమవారం చిన్నాన్నకు భోజనం పెట్టడంలో ఆలస్యం కావడంతో సురేశ్ ఆగ్రహంతో రెడ్డి బాబును తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన రెడ్డిబాబు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ఒంగోలు: వైసీపీకి మేలు చేశారన్న అభియోగంపై టీచర్ రిలీవ్

image

రానున్న ఎన్నికలలో వైసీపీకి మేలు చేసేలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎం.ప్రసాద్ వ్యవహరిస్తుండడంతో ఆ బాధ్యత నుంచి రిలీవ్ చేశారు. ఒంగోలులో ఆయ‌న ప్రస్తుతం సిబ్బందికి ఎన్నికల విధులు వేసే పనిలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిస్తున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

News March 19, 2024

GREAT: మన గోదారి బిడ్డకు.. ఆల్ ఇండియా 32 RANK

image

ఇటీవల నిర్వహించిన గేట్ పరీక్షల్లో ఏలూరుకు చెందిన కె.సాయి ఫణీంద్ర ఆలిండియాలో ఉత్తమ ర్యాంకు సాధించాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే చదువుకున్నానని ఫణీంద్ర తెలిపాడు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ ఫర్‌మేషన్ టెక్నాలజీ (సీఎస్) విభాగంలో పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 921 మార్కులు సాధించి 32వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

News March 19, 2024

తూర్పుగోదావరి: సెల్యూట్ ‘అమ్మ’❤

image

యానాంకు చెందిన కడలి మధు, మాధవ్ చిన్నతనంలోనే నాన్న ప్రేమకు దూరమయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా వారి చదువు, బాగోగులు అన్నింటినీ వాళ్ల అమ్మే చూసుకుంది. ఇద్దరు కొడుకులను బాగా చదివించింది. ఈ క్రమంలో ఇద్దరూ కానిస్టేబుళ్లు అయ్యారు. ఇటీవల పుదుచ్చేరి పోలీస్ శాఖ ప్రకటించిన పదోన్నతులలో ఏఎస్సైలుగా బాధ్యతలు స్వీకరించారు. ఏఎస్సై యూనిఫాంలో ఇంటికి వచ్చి వారి అమ్మకు సెల్యూట్ చేస్తూ పొంగిపోయారు.
– GREAT కదా.

News March 19, 2024

గుంటూరు: ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా రైతులకు విజ్ఞప్తి

image

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి సోమవారం ఒక ప్రకటన ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ఆధారం లేకుండా అధిక మొత్తంలో నగదును తీసుకొని వెళ్లడం నేరం. మిర్చి యార్డులో మిర్చి అమ్ముకొని నగదు తీసుకొని వెళ్లేటప్పుడు రైతు సోదరులు నగదుకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు. ఆ రసీదు మీకు ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు.