Andhra Pradesh

News March 19, 2024

జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలి: వర్మ

image

గొల్లప్రోలు మండలం చందుర్తిలో నిర్వహించిన బీసీ, ఎస్సీల అవగాహన సదస్సులో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురంలో జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ- జనసేన- బీజీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం నియోజవర్గ అభివృద్ధి విషయంలో సహకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

News March 19, 2024

ప.గో: ‘పది’ పరీక్షలకు 1597 మంది గైర్హాజరు

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన SSC పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి రమణ తెలిపారు. తొలి రోజు తెలుగు పరీక్షకు 23,120 మందికి గాను 21,523 మంది హాజరయ్యారని,  1597 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలపకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

News March 19, 2024

పోలింగ్ విధులపై అవగాహనతో ఉండాలి: తిరుపతి కలెక్టర్

image

పోలింగ్ విధులపై అధికారులు పూర్తి అవగాహణ కలిగి ఉండాలని తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలన్నారు. లోటుపాట్లు లేకుండా పోలింగ్ విధులకు సిద్ధం కావాలన్నారు.

News March 19, 2024

నెల్లూరు: ప్రత్యర్థులందరూ కొత్తముఖాలే..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.

News March 19, 2024

మాజీ ఎమ్మెల్యేని కలిసిన మంత్రి గుడివాడ

image

గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్యను గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా కలిసారు. మంత్రి అమర్నాథ్ సోమవారం చింతలపూడి ఇంటికి వెళ్లి ఈ ఎన్నికలలో సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై ఇరువురు చర్చించుకున్నారు. తన విజయానికి కృషి చేస్తానని చింతలపూడి హామీ అమర్నాథ్ తెలిపారు. 

News March 19, 2024

అనుమానస్పద ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించండి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమానస్పద ఆర్థిక లావాదేవీలు అక్రమంగా డబ్బు తరలింపును కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగము బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తన ఛాంబర్ లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనుమానస్పద లావాదేవీలు అంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.

News March 19, 2024

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి:రిటర్నింగ్ అధికారి

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలని, సువిధ యాప్‌లో అనుమతులు తప్పక తీసుకోవాలని కడప ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, సువిధ యాప్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ECI గైడ్ లైన్స్ ప్రకారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తప్పక పాటించాలని కోరారు.

News March 19, 2024

తల్లితండ్రులను పట్టించుకోకుంటే కేసులు: కలెక్టర్

image

తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ద్వారకాతిరుమల తహసీల్దార్‌ను ఆదేశించారు. ఏలూరులో కలెక్టర్‌ను ద్వారకాతిరుమల మండలం పి.కన్నాపురానికి చెందిన చిట్టెమ్మ కలిసి తన బాధను తెలిపి, న్యాయం చేయాలని కోరింది. తన కుమారుడు నిరాదరణకు గురిచేస్తున్నాడని, ఎటువంటి ఆధారం లేదని, న్యాయం చేయాలని కోరింది.

News March 19, 2024

కర్నూలు: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

image

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైనట్లు క్యాంపు ఆఫీసర్, ఆర్ఐఓ ఎస్విఎస్ గురువయ్య శెట్టి వెల్లడించారు. సోమవారం కర్నూలులోని టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం జరిగిందన్నారు. ప్రతిరోజు మూల్యాంకనానికి హాజరయ్యే అధ్యాపకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా క్యాంపులో ఉండాలన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 15, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.

News March 19, 2024

ఈవిఎం గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమి తనిఖీ చేశారు. జిల్లా స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.