India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి మండలంలో ఆయన రిజర్వు పోలీసు దళాల ఫ్లాగ్ మార్చ్ లో సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఓటర్లు ఎటువంటి భయబ్రాంతులకు, ప్రలోభాలకు గురికావద్దని సూచించారు.
రాయలసీమ వర్శిటీ, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సంయుక్తంగా ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ తక్రా పోటీలు సోమవారం ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో రెండో రోజు కొనసాగాయి. రెండో రోజు Apj Abdul Kalam యూనివర్సిటీపై MJPR బరేలి యూనివర్సిటీ, శ్రీ కుషల్ దాస్ యూనివర్సిటీపై అన్నా విశ్వవిద్యాలయం, మాధవ్ యూనివర్సిటీపై ఉస్మానియా యూనివర్సిటీ, గొందావాన్ యూనివర్సిటీపై రాయలసీమ యూనివర్సిటీ జట్లు విజయం సాధించాయి.
బహుజన సమాజ్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.. విజయవాడ హనుమాన్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసే తమ 11 మంది లోక్ సభ, 50 మంది శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరం జ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికల్లో బీసీలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వలేదని శ్రీ కృష్ణ యాదవ సేవాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో సోమవారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. సామాజిక న్యాయం పాటించకుండా వలస పక్షులకు సీట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ క్రమంలో లోకేశ్ మంగళగిరి సీటును వదులుకోవాలని, బీసీలకు ఆ సీటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించడానికి మాజీ సైనిక ఉద్యోగస్థులు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక కోరారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో సైనిక బోర్డులో సభ్యత్వం ఉన్న మాజీ సైనిక ఉద్యోగస్థులతో ఎన్నికల విధులపై సమీక్షించారు. జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల బందోబస్తు విధులకు 60ఏళ్ల లోపు మాజీ సైనికులు వివరాలతో ఈ నెల 25లోగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.
విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా 3వ సారి పోటీ చేస్తున్న కేశినేని నాని అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. విజయవాడలో ఇప్పటి వరకూ 17 సార్లు ఎన్నికలు జరగగా కానూరి లక్ష్మణరావు మాత్రమే 1962, 67, 71లో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014, 19లో టీడీపీ నుంచి గెలిచిన నాని రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిస్తే లక్ష్మణరావు రికార్డును సమం చేసే అవకాశం ఉంది.
గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో వాలంటీర్స్ చేస్తున్న ప్రచారంపై ఎంపీడీవో రత్నకుమారి ఆధ్వర్యంలో సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాలంటీర్స్ ప్రచారం చేయడంపై విచారణ చేపట్టామని, నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్, ఈవోపీఆర్డీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని తప్పక పాటించి సహకారం అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయా పార్టీల పాలసీల గురించి మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.