India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. పీటీఎం మండలం చండ్రాయునిపల్లి సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే సహచరులు ఏఎస్ఐని 108లో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.
తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతి చెందారు. వోలేటివారిపాలెం మండలం కొండ సముద్రానికి చెందిన వేణుగోపాల్(32) జగిత్యాల జిల్లా కొండగట్టుకు వలస వెళ్లారు. నిన్న ఉదయం పసుపులేటి శ్రీకాంత్ (27), వెంకటేశ్ (33) కూలీలను తన బైక్‌పై తీసుకుని మెట్‌పల్లిలో మేస్త్రి పనులకు బయలుదేరాడు. జగిత్యాల-కోరుట్ల మార్గంలో వెంకటాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు.
ప్రతి సోమవారం నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు రద్దు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు విషయాన్ని గుర్తించి.. సహకరించాలని కోరారు.
ఏలూరు జిల్లాలో ఓటర్లు ఇలా.. మొత్తం ఓటర్లు- 16,25,655 పురుషులు- 7,93,829, స్త్రీలు- 8,31,701 థర్డ్ జెండర్స్- 125, సర్వీస్ ఓటర్లు- 686 పోలింగ్ స్టేషన్లు 1,743 ప.గో జిల్లాలో ఇలా..మొత్తం ఓటర్లు – 14,61,337 పురుషులు- 7,16,955, స్త్రీలు 7,44,308 థర్డ్ జెండర్స్- 74, పోలింగ్ స్టేషన్లు- 1,463 ఉన్నాయి.
నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 40,063 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సదుపాయం కల్పించారు.
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచికల గుడిపాడు గ్రామ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై, ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్‌ను నేడు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పోలీస్ కార్యాలయానికి ప్రజలు రావద్దని కోరారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,746 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 28,080 మంది రెగ్యులర్, 4,666 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 7 సమస్యాత్మక కేంద్రాలు(సీతారామపురం, నారాయణ రెడ్డిపేట, కలువాయి ఏ, బీ సెంటర్లు, సౌత్ మోపూరు, మర్రిపాడు, రేవూరు) గుర్తించారు. వీటిలో 4 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా.. పాఠశాలల్లో నేటినుంచి ఒంటి పూట నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే వెంకటేశ్వరరావు ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని స్పష్టం చేశారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లాలో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. వివరాలు.. ఏలూరుకు చెందిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. నూజివీడుకు చెందిన పురమా సాయిబాబు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె అతడికి దగ్గరైంది. ఈ క్రమంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాత అబార్షన్ చేయించి.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. యువతి ఫిర్యాదుమేరకు కేసు నమోదైంది.
రెండు బైకులు ఢీకొని ముగ్గురు యువకులకు గాయాలైన సంఘటన దర్శి మండలంలోని రాజంపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. క్షతగాత్రుల బంధువు కథనం మేరకు.. పొదిలి విశ్వనాథపురానికి చెందిన అస్మత్ బాషా, చరణ్‌తేజ బైక్‌పై దర్శి వెళ్తున్నారు. అదే మార్గంలో ముందు వెళ్తున్న రాజంపల్లికి చెందిన గుర్రపుశాల నాగార్జున గేదెలు అడ్డురావడంతో ముందు బైక్‌ను ఢీకొని పడిపోయారు. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.