India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరులో ఆదివారం దారుణం చోటుచేసుకొంది. మద్యానికి బానిసైన ఓబులేశు నిత్యం వేదిస్తున్నాడని సహనం కోల్పోయిన భార్య లలితమ్మను గొడ్డలితో తల, మేడ భాగంలో దాడి చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. క్షతగాత్రుడిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రతి సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి శనివారం తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో ఉన్న ప్రజలు, అర్జీ దారులు గమనించాలని కోరారు.
ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామపంచాయతీ ఎ.బలరాంపురం గ్రామానికి చెందిన ఎ.నీలాద్రి 2024 గేట్ ఎగ్జామ్‌లో ఆల్ ఇండియాలో 343వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఒక వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన నీలాద్రి కఠోర సాధనతో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం పై పలువురు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ స్నేహితుడు శంకర్ సహాయంతో ఈ విజయం సాధించినట్లు నీలాద్రి తెలిపారు.
చిలకలూరిపేట బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్నాడులోని ప్రముఖ క్షేత్రం కోటప్పకొండను ప్రస్తావించారు. అక్కడ ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం ఎన్డీఏ కూటమికి ఉందని ఆయన తెలియజేశారు. మోదీ హిందీలో ప్రసంగించగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి తెలుగులోకి అనువాదం చేశారు.
ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ తక్రా పోటీలను ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఒకే రోజు జరిగిన 24 పోటీల్లో శ్రీకాకుళంపై రాయలసీమ యూనివర్సిటీ, జై నారాయణ వ్యాస్ విశ్వ విద్యాలయంపై కొచ్చిన్ విశ్వవిద్యాలయం, జైపూర్ నిర్వాణ విశ్వ విద్యాలయంపై యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, మాధవ్ యూనివర్సిటీ పింద్వరాపై మౌలానా ఆజాద్ జోడ్‌పూర్ విజయం సాధించాయి.
చెరకు తోటలో మంటలు అంటుకుని సుంకర పోతురాజు అనే వ్యక్తి మృతి చెందాడు. బుచ్చయ్యపేటకు చెందిన పోతురాజు తన తోటలో చెత్తకు ఆదివారం మంట పెట్టాడు. ఈ మంటలు చెలరేగి పక్కనున్న మరో చెరుకు తోటకు వ్యాపించాయి. దీంతో మంటలు ఆర్పేందుకు వెళ్లి అందులో చిక్కుకున్నాడు. ప్రమాదంలో శరీరం కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు.
ప.గో జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం వెల్లడించారు. మొత్తం 1,463 పోలింగ్ స్టేషన్లలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి విధులను కూడా సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు అప్పజెప్పడం లేదని, పరోక్షంగా వాలంటీర్లు ఎవరికైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలో గ్రూప్-1 పరీక్షలు సజావుగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పేపర్ -1 కు సంబంధించి మొత్తం 6,403 మందికి గానూ పరీక్షలకు 4,124 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. 2,279 మంది పరీక్షలకు హాజరుకానట్లు వెల్లడించారు. పేపర్-2కు సంబంధించి 6,403 మందికి 4088 మంది హాజరయ్యారు. 2,315 మంది పరీక్షలకు హాజరు కాలేదు.
ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆర్టీసీ బస్సులలో టెన్త్ క్లాస్ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ ఆదివారం తెలిపారు. నియోజకవర్గంలోనీ మీ ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రాల వరకు అన్ని పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు.
కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించారు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఫోటో బ్యానర్‌పై కనిపించగా అదే వేదికపై పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రసంగించారు. బ్యానర్‌లో ఒకరు, వేదికపై ఒకరిని చూసిన అక్కడున్న వారు పొలిటికల్ కామెంట్స్ చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.