Andhra Pradesh

News March 17, 2024

నరసరావుపేట: కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను ఆదివారం కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన యాప్‌లు ఏవీ ఎలా మానిటర్ చేయాలని సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ విభాగంలో పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వారికి నిర్దేశించిన ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు.

News March 17, 2024

శ్రీకాకుళం: నేటి ఆదిత్యుని ఆదాయ వివరాలు

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.3,02,300, పూజలు, విరాళాల రూపంలో రూ.88,790, ప్రసాదాల రూపంలో రూ.1,92,006, శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవోఎస్ చంద్రశేఖర్ తెలిపారు. సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు.

News March 17, 2024

చిత్తూరు: ఫొటోలు తొలగించి చిక్కీల అందజేత

image

ఎలక్షన్ కోడ్ ప్రకటించడంతో ప్రభుత్వ పథకాల్లో రాజకీయ నాయకుల ఫొటోలకు చెక్ పెట్టారు. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలపై ఉన్న ఫోటోలను తొలగించారు. రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా చిక్కీలను మాత్రమే విద్యార్థులకు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు HMలకు ఆదేశాలు జారీ చేశారు.

News March 17, 2024

నార్పల: పొలం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 

image

నార్పల మండలంలోని గూగుడు గ్రామంలో శనివారం రాత్రి పొలం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బైక్‌కు నిప్పు పెట్టగా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

చంద్రబాబును కలిసిన DA శ్రీనివాస్

image

దివంగత MP ఆదికేశవులు నాయుడు కుమారుడు DA శ్రీనివాస్ హైదరాబాద్‌లో చంద్రబాబును కలవడం ఆసక్తి మారింది. ఇటీవల ఆయన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో చేరుతారని వివధ రకాలు వార్తలు వచ్చాయి. చిత్తూరులో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన శ్రీనివాస్ ఆ తర్వాత కనిపించలేదు. అప్పట్లో పెద్దిరెడ్డిని కలిసిన ఆయన నేడు చంద్రబాబుతో భేటి కావడం ఆసక్తి రేపుతోంది.

News March 17, 2024

BREAKING: నెల్లూరులో తప్పిన ప్రమాదం

image

నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. ప్లాట్ ఫాం-1పై హెటెన్షన్ వైర్ తెగిపడింది. దీంతో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఘటన సమయంలో పట్టాలపై రైలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు.

News March 17, 2024

ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష..

image

ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ కొండయ్య, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి, కదిరి ఆర్డిఓలు భాగ్యరేఖ, వంశీకృష్ణ తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

News March 17, 2024

కర్నూలు: CM జగన్ బహిరంగ సభ వాయిదా

image

ఆలూరులో ఈనెల 20వ తేదీ నిర్వహించవలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఆలూరు వైసీపీ అబ్జర్వర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. సీఎం బహిరంగ సభను ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు.

News March 17, 2024

చిలకలూరిపేట టీడీపీ కూటమి సభపై YCP ట్వీట్

image

చిలకలూరిపేట టీడీపీ కూటమి సభపై YCP సెటైరికల్ ట్వీట్ చేసింది. 2014లో ఈ 3 పార్టీలు 650 హామీలు ఇచ్చి, అధికారం చేపట్టిన తర్వాత మేనిఫెస్టోను అటకెక్కించాయని పేర్కొంది. ఇప్పుడు అవే పార్టీలు అధికార దాహం కోసం ప్రజలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించింది. మళ్లీ మేనిఫెస్టోతో మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించింది.

News March 17, 2024

గుడివాడ: జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అభ్యర్థిగా హేమంత్

image

రాజకీయాల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలని, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కోరారు. ఆదివారం గుడివాడకు చెందిన న్యాయవాది అల్లూరి హేమంత్ కుమార్‌ను గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లోకి యువత రావడం ఎంతో అవసరం అన్నారు. జిల్లా కో-ఆర్డినేట‌ర్ బి.స‌త్య వ‌సుంధ‌ర‌, లీగ‌ల్ సెల్ ప్రెసిడెంట్ నాయ‌ర్, పాల్గొన్నారు.