Andhra Pradesh

News March 30, 2025

కృష్ణా: UG పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన UG 3వ, 5వ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రీ వాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 30, 2025

VZM: జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. శనివారం గుర్లలో 42.1°C నమోదైంది. ఇవాళ కూడా జిల్లా వ్యాప్తంగా వడగాలులు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయి. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్.కోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రపురం, రేగిడి, ఎస్.కోట, తెర్లాం, వంగర మండలాల్లో దాదాపు 40°C నమోదవుతుందని APSDMA హెచ్చరించింది.

News March 30, 2025

నేడు విశాఖ రానున్న మంత్రి నారా లోకేశ్

image

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆదివారం విశాఖ రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.  అక్కడి నుంచి రోడ్డు మార్గాన IPL మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం రామ్‌నగర్‌లో గల ఎన్టీఆర్ భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. వీటికి తగ్గట్టు పార్టీ వర్గాలు ఏర్పాటు చేస్తున్నారు.

News March 30, 2025

జైలులో మహిళా ఖైదీ సూసైడ్

image

ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న శాంతికుమారి అనే మహిళా ఖైదీ బ్యారక్‌లో చున్నితో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శాంతి కుమారిది జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24న అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2025

గుంటూరు: ‘క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు’

image

గుంటూరు జిల్లాలో 2025లో ఇప్పటివరకు 162 మంది వరకు సూసైడ్ చేసుకున్నారని అధికారులు చెప్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఈనెలలో ఇప్పటికే 49 మంది సూసైడ్ చేసుకున్నారన్నారు. 2023లో 883మంది, 2024లో 806 మంది సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం సూసైడ్‌లు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందన్నారు. క్షణికావేశంలో సూసైడ్ చేసుకునే నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులు కోరుతున్నారు. 

News March 30, 2025

కృష్ణా: రేపటి నుంచి పెరగనున్న పాల ధరలు

image

విజయ పాల ధరను పెంచుతూ కృష్ణామిల్క్‌ యూనియన్‌(విజయ డెయిరీ) నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. విజయ డెయిరీలోని గోల్డ్‌ పాల ధర ప్రస్తుతం లీటరు రూ.74 ఉండగా తాజాగా పెరిగిన ధరతో రూ.76 కానుంది. ఫుల్‌ క్రీమ్‌ లీటరు రూ.72 నుంచి 74 పెరిగినట్లు వెల్లడించారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు.

News March 30, 2025

డెంకాడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

డెంకాడ మండలంలోని శనివారం రాత్రి ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు బలంగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో విజయనగరంలోని గాంధీనగర్‌కు చెందిన నేమాల రవి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మృతుడు సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉగాది రోజు ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

News March 30, 2025

చిత్తూరు: రేషన్ ఈ-కేవైసీకి గడువు పెంపు

image

రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచినట్లు డీఎస్ఓ శంకరన్  తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీలోపు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు 17 లక్షల మంది వరకు ఈకేవైసీ చేయించుకున్నారని, ఇంకా చేయించుకోవాల్సిన వారు 1.50 లక్షల మంది మిగిలారని వివరించారు.

News March 30, 2025

నేడు ఆత్కూర్ స్వర్ణ భారత్‌కు చంద్రబాబు 

image

సీఎం చంద్రబాబు ఆదివారం కృష్ణా జిల్లాకు రానున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఉగాది సంబరాలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే సంబరాలకు ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. 

News March 30, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇవే

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ మాంసం కిలో. 184, స్కిన్ లెస్ మాంసం కిలో రూ. 210, లేయర్ మాంసం కిలో రూ.145 కు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. బర్డ్ ప్లూ అనంతరం చికెన్ ధరలలో పెరుగుదల కనబడుతోంది. పండుగల కారణంగా చికెన్ ధరలు పెరిగినట్టు పలువురు తెలుపుతున్నారు. మీ ప్రాంతాలలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.