India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మళ్లీ అది ఊపందుకుంది. ప్లాస్టిక్ నిషేధం ప్రస్తుతం ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ప్లాస్టిక్ కవర్లను మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వాటి వినియోగం పర్యావరణ పరిరక్షణకు సవాలుగా మారింది. పూర్తిస్థాయిలో జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఫిబ్రవరి మాసం నుంచి జిల్లాలో శుభకార్యాలు ఊపందుకోనున్నాయి. కొద్దిరోజులుగా సరైన ముహూర్తాలు లేక శుభకార్యాలు జరగడం లేదు. ఫిబ్రవరి నుంచి శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు కళ్యాణమండపాలను ఇప్పటికే ముందస్తుగా రిజర్వ్ చేసుకుంటున్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ఎక్కువగా పెళ్లి ముహూర్తాలకు వేదికలను సిద్ధం చేసుకుంటున్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగున్నాయి.

జిల్లాలో మీడియా ప్రతినిధులకు 407 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ఎస్.రాం.సుందర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. పత్రికలు, టీవీ చానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియాకు చెందిన ప్రతినిధులకు కార్డులు మంజూరు చేశారు.

కడప జిల్లాలోని అర్హులైన 569 మంది జర్నలిస్టులకు తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపిందని DMAC ఛైర్మన్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేశామని, మొదటి సమావేశంలో 569కి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు.

భోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంతం మండలాలకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు ఇటీవల బంగ్లాదేశ్ నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే. మత్స్యకారులు బంగ్లాదేశ్ చెర నుంచి విడిపించడంలో కూటమి ప్రభుత్వం చేసిన కృషికి మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిశారు. ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్‌ని మత్యకారులు కోరారు.

ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యువరాజు (43) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధ తట్టుకోలేక, ఇంట్లో ఎవరి లేని సమయంలో మగ్గానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య ఉషారాణి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లికి చెందిన కసుకుర్తి కార్తిక్(23) ఒంగోలు IIIT క్యాంపస్‌లో B.Tech పూర్తిచేశాడు. అనంతరం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతూ.. ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 తుది ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే ASO (GAD)గా ఉద్యోగం పొందాడు. దీంతో ఉపాధ్యాయులు, తోటి స్నేహితులు, తల్లిదండ్రులు అభినందించారు. కార్తిక్ తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ కాగా, తల్లి కూలీ పనులకు వెళ్తుంటారు.

CM చంద్రబాబు అగస్త్య ఫౌండేషన్‌లో విద్యార్థుల మధ్యలో కూర్చొని అగస్త్య 25 ఏళ్ల ప్రస్తావాన్ని వీడియో రూపంలో తిలకించారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించడంలో నవీనత, విజ్ఞానం, సాంకేతిక ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నారు. అకాడమీ ప్రతినిధులు విద్యార్థులకు తమ సైన్స్ & టెక్నాలజీ ఆవిష్కరణ కార్యక్రమంపై వినూత్నంగా రూపొందించిన వీడియోను ఆయన తిలకించారు.

ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉద్యోగ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించిన పలు సమస్యలను వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

జగన్నాథ సాగర్ ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్ దినకర్ స్పందించారు. శుక్రవారం ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. చెరువు పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను జేసీబీలతో తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో 24 గంటల్లోగా ఆక్రమణలన్నీ తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి వివరించారు.
Sorry, no posts matched your criteria.