Andhra Pradesh

News March 30, 2025

భీమవరం: రేపు పీజీఆర్ కార్యక్రమం రద్దు

image

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసిట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నెల 31న రంజాన్ పండుగ కారణంగా రద్దు చేశామన్నారు. కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయిలోనూ జరిగే కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు

News March 30, 2025

ప్రకాశం: వైసీపీ ఉద్యోగ పెన్షనర్ విభాగ అధ్యక్షులు వీరే..!

image

ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల ఉద్యోగ పెన్షనర్ల విభాగ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల వివరాలను కిందిలా ఉన్నాయి.
>గిద్దలూరు- బంగారు విశ్వరూపం
>కనిగిరి – ఏకుల వెంకట సుబ్బారెడ్డి
>దర్శి – రావులపల్లి గురుప్రసాద్
>కొండేపి- పి కృష్ణమూర్తి
>మార్కాపురం – టీ రంగారెడ్డి
>ఒంగోలు – పెట్లూరి ప్రసాద్‌‌లు నియమితులయ్యారు.

News March 30, 2025

గుంటూరు: మటన్ కేజీ ధర ఎంతో తెలుసా.?

image

గుంటూరులో చికెన్ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ ప్రభావంతో ఇటీవల కొంతమేర ధరలు తగ్గిన విషయం తెలిసిందే. గత ఆదివారం రూ.180 ఉన్న స్కిన్ లెస్ చికెన్ ధర నేడు రూ.230కి చేరింది. దీంతో గత వారంతో పోల్చుకుంటే రూ.50ధర ఎక్కువైంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ.1000 విక్రయిస్తున్నారు. 

News March 30, 2025

విశాఖలో తండ్రిని చంపిన తనయుడు

image

విశాఖ శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పి అప్పారావు (82) ఆరిలోవ సెక్టార్- 2 డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్నాడు. తరచూ తన భార్యను తిట్టడం, కుమారుడు మీద పరుషపదజాలం వాడటం వంటివి చేస్తుంటాడు. కాగా శనివారం తన తల్లిని తండ్రి అప్పారావు కొట్టడంతో కోపోద్రిక్తుడైన కుమారుడు బాలయోగి బ్లేడుతో దాడి చేశాడు. దీంతో అప్పారావు చనిపోయారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News March 30, 2025

అనంత: ఉగాది, రంజాన్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

నేడు ఉగాది, రేపు రంజాన్ పండుగ సందర్భంగా అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ రూ.180-190గా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150తో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్‌ ధర రూ.700 నుంచి రూ.750గా ఉంది.

News March 30, 2025

కర్నూలు జిల్లాలో చికెన్ ధర రూ.200

image

కర్నూలు జిల్లాలో పలు చోట్ల చికెన్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, తదితర ప్రాంతాల్లో లైవ్ కోడి కిలో రూ.120 ఉండగా.. స్కిన్‌ రూ.180, స్కిన్ లెస్ రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. 2 నెలల క్రితం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గి, మటన్, చేపల విక్రయాలు పెరిగాయి. దీంతో కిలో మటన్ రూ.900, చేపలు రూ.300 చొప్పున అమ్ముతున్నారు.

News March 30, 2025

చిత్తూరు జిల్లా ప్రజలకు SP గమనిక 

image

సోమవారం రంజాన్ పండుగ కావడంతో మీ కోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదులు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి ఈనెల 31న రావద్దని విజ్ఞప్తి చేశారు.

News March 30, 2025

భీమవరం: అత్యాచారం చేసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదు

image

తనను బెదిరించి అత్యాచారం చేశాడని భీమవరానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నాగారాజు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ఉండే ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి బాధితురాలి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అతని భార్యపై గతంలో పెట్టిన కేసు వాపసు తీసుకోవాలని బెదిరించాడు. ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేశారు. వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. కేసు నమోదైంది.

News March 30, 2025

కొండాపురం : తల్లిదండ్రుల మృతి.. అనాధలుగా పిల్లలు..!

image

కొండాపురంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగి రామ్మోహన్, సరోజ దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. మిగిలిన కుమార్తె బీటెక్ సెకండ్ ఇయర్, కొడుకు ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. వీరు అద్దె ఇంట్లో ఉంటున్నారు. దీంతో పిల్లలు అనాధలుగా మిగిలారని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. 

News March 30, 2025

అనంత: ఆ గ్రామంలో ఏడేళ్ల తర్వాత ఉగాది ఉత్సవాలు.. అసలేం జరిగింది..?

image

అనంతపురం పుట్లూరు మండలం మడుగుపల్లిలో ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు. అయితే ఏడేళ్ల క్రితం గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామికి ఎడ్లబండ్లను కట్టి గుడి వద్దకు వెళ్తున్న సమయంలో ‘మా బండి ముందు వెళ్లాలంటే.. మా బండి ముందు వెళ్లాలి’ అంటూ పెద్దఎత్తున రాళ్లదాడులు చేసుకోవడంతో పోలీసులు ఉత్సవాలను నిలిపివేశారు. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత తిరిగి ఉత్సవాలు జరగనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.