India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు శనివారం తెలిపారు. మృతుడు శ్రీకాకుళం పట్టణం గునాపాలెంకు చెందిన రమణారావు(49)గా గుర్తించారు. శుక్రవారం నుంచి రమణారావు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ట్రాక్‌పై విగతజీవిగా పడి ఉన్న రమణను చూసి నిశ్చేష్ఠులయ్యారు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
విశాఖ శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పి అప్పారావు (82) ఆరిలోవ సెక్టార్- 2 డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్నాడు. తరచూ తన భార్యను తిట్టడం, కుమారుడు మీద పరుషపదజాలం వాడటం వంటివి చేస్తుంటాడు. కాగా శనివారం తన తల్లిని తండ్రి అప్పారావు కొట్టడంతో కోపోద్రిక్తుడైన కుమారుడు బాలయోగి బ్లేడుతో దాడి చేశాడు. దీంతో అప్పారావు చనిపోయారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తాము ఎందులోను తక్కువ కాదంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు మహిళలు నిరూపిస్తున్నారు. ఇటీవల వినూత్నంగా చీరలు తయారు చేసి రాష్ట్రపతిని శ్రీకాళహస్తి మహిళ మొప్పించిన విషయం తెలిసిందే. తాజాగా సోమలకు చెందిన సంజన ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ ఉద్యోగానికి ఎంపికై అందరి చేత శభాష్ అనిపించింది. చిత్తూరులో జిల్లాలో ఈ ర్యాంక్ స్థాయి ఉద్యోగాన్ని పొందిన మొదటి మహిళ సంజనే అంటూ ఆమె కుటుంబీకులు తెలిపారు.
పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని జిల్లా SP అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో, నెలవారీ నేర సమీక్షా నిర్వహించారు. జిల్లాను గంజాయి, ఇతర నిషేదిత మత్తు పదార్థాల రహితంగా చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం అతడితో పాటు పెడనకు చెందిన కోట నాగేశ్వరరావు, కృష్ణలంకకు చెందిన ఉమామహేశ్వరరావు, అవనిగడ్డకు చెందిన గోపయ్యస్వామి, వెంకటరమణ పటమట పోలీసులకు అప్పగించారు. వీరు మొత్తం రూ.48లక్షల లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కాఫీ షాపులు, కిల్లి కోట్లు కలెక్షన్ పాయింట్లుగా, వాహన నంబర్‌లతో డబ్బులు లావాదేవీలు చేశారు.
తణుకు మండలం వేల్పూరు గ్రామంలో మద్యం షాపు వద్ద శనివారం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన కుడిపూడి శ్రీనివాసరావు (48) శనివారం మధ్యాహ్నం అపస్మారక స్థితిలో పడి ఉండటంతో షాపు సిబ్బంది ఇంటి దగ్గర దించారు. అయితే అప్పటికే మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు తణుకు రూరల్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక ఎవరితో అయినా ఘర్షణ జరిగిందా అనేది తేలాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల ఉద్యోగ పెన్షనర్ల విభాగ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల వివరాలను కిందిలా ఉన్నాయి.
>గిద్దలూరు- బంగారు విశ్వరూపం
>కనిగిరి – ఏకుల వెంకట సుబ్బారెడ్డి
>దర్శి – రావులపల్లి గురుప్రసాద్
>కొండేపి- పి కృష్ణమూర్తి
>మార్కాపురం – టీ రంగారెడ్డి
>ఒంగోలు – పెట్లూరి ప్రసాద్‌లు నియమితులయ్యారు.
ప్రతి సోమవారం జరిగే పోలీసు ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. మరల వచ్చే సోమవారం యధావిధిగా ఈ ప్రజా ఫిర్యాదు పరిష్కార కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యువెలర్స్ షాప్‌లో ఉత్తర భారత దేశానికి చెందిన ఇద్దరు మహిళలు నకిలీ వెండి చూపించి బంగారు డైమండ్ రింగ్, మరొక షాప్‌లో వెండి చెంబుతో ఉడాయించినట్లు యజమానులు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వారక పోలీసులు సీసీ టీవీ ద్వారా దర్యాప్తు చేసి శనివారం నలుగురు మహిళలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారం, వెండిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కి తరిలించారు.
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యా విధానంలో B.A, B.Com డిగ్రీ విద్యనభ్యసించేందుకు దరఖాస్తుకు ఆఖరు తేది మార్చి 31తో ముగుస్తుందని శనివారం కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తిర్ణీత అయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.