India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలలో భరోసా కల్పించేందుకు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు శనివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా పోలీసులు పాల్గొన్నారు.
విద్యుత్ నిఘా శాఖ, DPE అధికారులు విజయనగరం సర్కిల్ పరిదిలో పలు ప్రాంతాల్లో సంయుక్తంగా దాడులు చేసినట్లు విద్యుత్ విజిలెన్స్ విజయనగరం సర్కిల్ సీఐ కె. కృష్ణ శనివారం తెలిపారు. తెర్లాం మండలం బూరిపేట, మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామాలలో విద్యుత్ చౌర్యం చేస్తున్న నిందితుల నుంచి 1,03,548 అపరాద రుసుం, రూ.10వేలు జరిమానా విధించామన్నారు. విద్యుత్ చౌర్యం సమాచారం తెలిస్తే 08922-234579కి తెలియజేయాలన్నారు.
అనంతపురం కలెక్టరేట్‌లో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల కోడ్ ను కఠినంగా అమలు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పోస్టర్లను, ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కృష్ణ కాంత్‌తో కలిసి ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించడం జరుగుతుందన్నారు.
అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణికి టిక్కెట్ కేటాయిస్తూ అధిష్ఠానం సస్పెన్స్‌కు తెరదించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన గుమ్మా తనూజారాణికి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కుమారుడు వినయ్ తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. తనూజారాణి తండ్రి శ్యాం సుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ సర్పంచ్‌గా చేస్తున్నారు.
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని తణుకు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన తనయుడు కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. తండ్రి కొడుకులు ఒకే పార్టీలో ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ పోటీలో ఉండడం ఆసక్తికరంగా మారింది.
జిల్లాలో 18,63520 మంది ఓటర్లు ఉండగా వారిలో 9,23,498 మంది పురుషులు, 9,39,891 స్త్రీల ఓటర్లు ఉన్నారని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. 131 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని 2357 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్నారు. ఓటర్లకు ఆయా పోలింగ్ కేంద్రాలలో పలు సౌకర్యాలు సమకూర్చామన్నారు.
విశాఖ నగరంలో హీరో శ్రీ విష్ణు శనివారం సందడి చేశారు. ఆయన నటించిన ఓమ్ భీమ్ బుష్ చిత్ర బృందం ఓ హొటల్‌లో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తనతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించారన్నారు. ఈ చిత్రాన్ని శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారన్నారు. మార్చి 22న విడుదల అవుతుందన్నారు. కుటుంబ సమేతంగా, ఇంకా యూత్‌ను ఆకట్టుకునే చిత్రమని పేర్కొన్నారు.
రేపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరగనున్న గ్రూప్-1 అభ్యర్ధుల స్క్రీనింగ్ టెస్ట్‌కు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తుషార్ డూడి శనివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం గుంటూరు రైల్వేస్టేషన్ తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద, ఆర్టీసీ బస్టాండ్, హిందూ కాలేజ్ జంక్షన్ల వద్ద పోలీస్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గమనించాలన్నారు.
గుడిబండ మండలం పలారంలో రైతు కుటుంబానికి చెందిన కుటుంబంలో జన్మించిన ఈర లక్కప్ప మడకశిర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమితులయ్యారు. ఆయన 1989-99 వరకు ఓ స్వచ్ఛంద సంస్థలో టీచర్‌గా పనిచేశారు. 2006-2011 వరకు గుడిబండ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించారు. 2015-2019 వరకు వైసీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.