India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ ఎంపీ అభ్యర్ధులుగా హిందుపురానికి బోయ శాంతమ్మ, అనంతపురానికి శంకర్ నారాయణను ఖరారు చేసింది. టీడీపీ మూడో జాబితాలో హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థ సారథికి అవకాశం కల్పించింది. ఈ నేపధ్యంలో అనంతపురం అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ జిల్లాలో నెలకొంది. టీడీపీ అధిష్ఠానం 2019లో పోటీ చేసిన జేసీ పవన్ కుమార్ రెడ్డి వైపు మెగ్గు చూపుతుందా.. లేదా ఇతరుకుల అవకాశం కల్పిస్తుందా.. మీ అభిప్రాయం చెప్పండి.
కడప 3వ డివిజన్ వైసీపీ ఇన్‌ఛార్జ్ సుదర్శన్‌రెడ్డిపై రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. డివిజన్‌లో ఒక హోటల్‌ను వైసీపీ నాయకులచే ప్రారంభించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెలూన్లు వైసీపీ జెండా రంగులను పోలి ఉన్నాయని సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేసి రూ.10వేలు అపరాధ రుసుం విధించారు. ఈ క్రమంలో జరిగిన వాదులాటలో ఆర్‌ఓ ఆదేశాల మేరకు ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు, అవుకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ చల్లా విజయ భాస్కర్ రెడ్డి, ఆయన బావమరిది కాశీపురం మెట్ల రామిరెడ్డి టీడీపీలో చేరారు. అమరావతిలోని చంద్రబాబు స్వగృహం నందు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబుతో విభేదించి ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. చిత్తూరు ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. దీంతో చంద్రగిరి నుంచి ఇండిపెండెంట్ MLA అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గల్లా అరుణకుమారి కాంగ్రెస్ MLAగా 14,392 ఓట్ల మెజార్టీతో గెలిచారు. TDP అభ్యర్థి రామనాథం నాయుడుకు 32,2446 ఓట్లు పడ్డాయి. రామ్మూర్తికి ఏకంగా 31,525 ఓట్లు రావడంతో అక్కడ TDP ఓడిపోయింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70 లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్ (40) ఆన్‌లైన్ ట్రేడర్. మ్యాట్రిమోని ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్న ఇతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.
భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్ సోమర్సెట్’ విశాఖతీరానికి చేరుకుంది. ఇది ఉభయచర యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది.
1982లో టీడీపీ స్థాపన అనంతరం నందిగామ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1989లో కాంగ్రెస్, 2019లో వైసీపీ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా టీడీపీ తమ ఇన్‌ఛార్జ్ తంగిరాల సౌమ్యకు టికెట్ ఇవ్వగా, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్‌ను బరిలోకి దించింది. వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా ఎగురుతుందా, వైసీపీ ఆధిపత్యం చూపునా మీ కామెంట్.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు ఆది, సోమవారాలు యథావిధిగా పనిచేస్తాయని ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించాలని కోరారు.
కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ జరుగుతుందని శనివారం జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. కోడ్ ఉల్లంఘన సహితమైన 11225 (పబ్లిక్), 3938 ప్రయివేటు అంశాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రూ.17.94 లక్షల నగదు, రూ.23.31 లక్షలు విలువైన లిక్కర్, ఇతర సామగ్రి 52.65 లక్షలు, మొత్తం రూ.1.1 కోట్ల వరకు సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
విద్యుత్ బిల్లులను ఆది, సోమవారాల్లో యథావిధిగా చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ నెల్లూరు జిల్లా ఎస్ఈ విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ సందర్భంగా సోమవారం సెలవైనప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పని చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.