Andhra Pradesh

News March 23, 2024

ప్రొద్దుటూరులో వ్యక్తి ఆత్మహత్య

image

కర్నూలుకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అదే జిల్లాలోని గోనెగండ్ల మండలంలో ఆయన పని చేసేవాడు. ఇటీవలె ఆయన్ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్థాపానికి గురై రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిని అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2024

శ్రీకాకుళం: ఎన్నికల వ్యూహం సమావేశానికి హాజరైన జిల్లా నేతలు

image

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో శనివారం పలువురు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, గౌతు శిరీష, బెందాళం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

News March 23, 2024

చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నం

image

విజయవాడ వెస్ట్ టికెట్ జలీల్ ఖాన్‌కు కేటాయించాలని మైనార్టీలు నిరసనకు దిగారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో టీడీపీ వర్క్ షాపుకు చంద్రబాబు హాజరవ్వగా, ఆయన కాన్వాయ్‌ను జలీల్ ఖాన్ వర్గం అడ్డుకునేందుకు యత్నించారు. పొత్తులో వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుందని, అయితే టికెట్ జలీల్ ఖాన్‌కు ఇవ్వాలని నిరసన తెలిపినట్లు సమాచారం.

News March 23, 2024

కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు వార్తలు అవాస్తవం: కృష్ణా జిల్లా I&PR డీడీ

image

సమాచార శాఖ ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కృష్ణా జిల్లా I&PR DD వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా మంత్రుల పేషీల్లో పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న పీఆర్ఓలు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు మాత్రమే ఆ మెమో వర్తిస్తుందన్నారు. ఈ మేరకు ఉదయం విడుదల చేసిన ప్రెస్ నోట్‌ను అధికారులు సవరించారు.

News March 23, 2024

అనంతపురం జిల్లా వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల నియామకం

image

అనంతపురం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి అనంతపురం అర్బన్‌కి వెంకటేష్, రాప్తాడుకి వసంతబాబు, ఉరవకొండకి కేతన్ గార్గ్, రాయదుర్గానికి కరుణకుమారి, శింగనమలకి వెన్నెల శ్రీను, తాడిపత్రికి రాంభూపాల్ రెడ్డి, కళ్యాణదుర్గంకి రాణి సుష్మిత, గుంతకల్లుకి శ్రీనివాసులు రెడ్డిలను నియమించారు.

News March 23, 2024

ఆదోని సబ్ కలెక్టర్ వాహనాన్ని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

image

అదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన పింజరి కాశీం అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గత నెల 26వ ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణశర్మ వాహనాన్ని కాశీం బైక్ వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

News March 23, 2024

వేసవిలో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి: కడప కలెక్టర్

image

వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. విజయవాడ నుంచి చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనుల లేబర్ కాంపోనెంట్ పెంపుతో పాటు, కూలీలకు కొరత లేకుండా తాగునీటి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News March 23, 2024

కురుపాం: సరిహద్దులో నిరంతరం పటిష్ఠ నిఘా: కలెక్టర్

image

రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతర పటిష్ఠ నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం కురుపాం మండలం మంత్ర జోల సమీపంలోని మూలిగూడ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎన్ని కేసులు, వాహనాలు సీజ్ చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News March 23, 2024

విశాఖ: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

నగర పరిధిలోని చినగదిలి వద్ద గల ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున శనివారం తనిఖీ చేశారు. ప్రతి మూడు మాసాలకు చేసే తనిఖీలో భాగంగా గోదాములను సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాముల లోపల గల వీవీ ప్యాట్లను, ఇతర సామగ్రిని స్వయంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును గమనించిన ఆయన సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

News March 23, 2024

నేను గెలవగానే కేసులు ఎత్తివేయిస్తా: పులపర్తి

image

వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో భీమవరం నియోజవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలవగానే జన సైనికుల మీద మత్స్యపురి అల్లర్లలో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు, జడ్పిటిసి గూండా జయప్రకాశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.