India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నకిలీ దస్త్రాలను సృష్టించి భూమిని సొంతం చేసుకునేందుకు సహకరించిన తహశీల్దార్ కుమారస్వామి, వీఆర్వో బీటీ సురేశ్‌పై శుక్రవారం కేసు నమోదైందని పెద్దకడుబూరు ఎస్ఐ మహేశ్ కుమార్ తెలిపారు. ఆదోనికి చెందిన స్వామినాథన్‌కు చిన్నతుంబళం గ్రామంలో 2.52 ఎకరాల భూమీ విషయంలో నకిలీ పత్రాల సృష్టించి బెదిరింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మంగళగిరిలో అసెంబ్లీకి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా, తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డి.లక్ష్మయ్యకు వచ్చిన మెజార్టీ(17,265)నే ఇప్పటివరకు అత్యధికం. ఆ తర్వాత 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఈ మెజార్టీని దాటలేకపోయారు. 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల మెజార్టీ ఇక్కడ అత్యల్పం. ఈసారి మంగళగిరి ఎన్నికల బరిలో నారా లోకేశ్, మురుగుడు లావణ్య బరిలో ఉన్నారు.
హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్- సంత్రాగచ్చి- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి తెలిపారు. సికింద్రాబాద్- సంత్రాగచ్చి (07645) ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.35కు దువ్వాడ చేరుకొని ఇక్కడి నుంచి 9.40కు బయలుదేరి వెళుతుందన్నారు.
గుడ్లవల్లేరు మండలం అంగలూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ పరిధిలోని డీఎడ్ విద్యార్థులు (2022- 24 బ్యాచ్) రాయాల్సిన సెకండియర్ 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు దేవానందరెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.
గార్లదిన్నెలో కూరగాయల మండీలో కూలీగా అస్సాం రాష్ట్రానికి చెందిన పప్పుబాగ్ (రాజు) పని చేసేవాడు. ఈక్రమంలో 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. 4నెలల గర్భవతిగా ఉండగా 2023 మే 26న బాలిక తల్లిదండ్రులు గార్లదిన్నె పోలీసుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో పదేళ్లు జైలు, రూ.3 వేలు పొక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించింది
2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీ గెలవలేకపోయింది. అవే చీరాల, కొండపి, పర్చూరు స్థానాలు. అభ్యర్థుల మార్పుతో ఎలాగైనా ఈసారి గెలవాలని గట్టి పట్టుదలతో అధిష్ఠానం భావిస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 25న సోమవారం జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని స్థానిక నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌లో పీఈఏస్ వైద్య కళాశాలకు ఆయన చేరుకుంటారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మహిళలతో ముఖాముఖి అనంతరం సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.
ఉమ్మడి తూ.గో జిల్లాపై TDP-జనసేన-BJP కూటమి ఫోకస్ పెట్టింది. పిఠాపురం నుంచి పవన్ పోటీ.. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళ్లనుండటం కేడర్‌లో జోష్ నింపింది. శక్తిపీఠం కొలువై ఉండటం, శ్రీపాద వల్లభుడు జన్మించిన పవిత్ర భూమి కావడంతో పవన్ ‘వారాహి’ ఇక్కడి నుంచే ప్రచారంలో దిగనున్నట్లు తెలుస్తోంది. 3రోజులు అక్కడే ముఖ్య నేతలతో భేటి కానున్నారట. త్వరలో చంద్రబాబు, లోకేశ్ సైతం పర్యటన చేపట్టనున్నారు.
రాష్ట్ర సమాచార శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ఉపసంహరించుకున్నట్లు ఆ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పెద్ద ఎత్తున తమ సానుభూతిపరులను సమాచార శాఖలోకి తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వీరందరినీ విధుల నుంచి తొలగిస్తూ సర్క్యులర్ మెమో నంబర్. 4539/అడ్మిన్-1-1/2019ను జారీ చేశారు.
ఇటీవల శొంట్యాంలో పెళ్లి కారు <<12894599>>బోల్తా పడిన విషయం<<>> తెలిసిందే ఈ ఘటనలో గాయాలైన ఓ బాలుడు ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆనందపురం ఎస్సై శివ వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు చిన్నారులలో తీవ్రంగా గాయపడిన కౌశిక్ (4) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం బంధువులకు అప్పజెప్పినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు పూర్తి సమాచారం కోసం కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.