Andhra Pradesh

News March 23, 2024

కర్నూలు: 20 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తికి టికెట్ నిరాకరణ

image

మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి 2014, 2019లో TDP తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ఆయనకు కాదని ఈసారి రాఘవేంద్రరెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో తిక్కారెడ్డి వర్గం నిరసనలు చేపట్టింది. మూడో జాబితాలో అయినా తననే అభ్యర్థిగా ప్రకటిస్తారేమోనని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో తిక్కారెడ్డి TDPలోనే కొనసాగుతారా? లేక వేరే పార్టీలోకి వెళ్తారా అనే చర్చ నడుస్తోంది.

News March 23, 2024

ఈ ఎన్నికల్లో సర్వేపల్లి ప్రత్యేకత ఇదే.!

image

సర్వేపల్లి నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థుల మధ్యే పోరు జరగనుంది. 2014, 19 ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య రసవత్తర పోరు సాగనుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఇలా పాత ప్రత్యర్థులు ముఖాముఖి తలపడే అవకాశం లేకుండాపోయింది. ఒక్క సర్వేపల్లి అభ్యర్థులకే ఆ అవకాశం దక్కింది.

News March 23, 2024

కృష్ణా: MP అభ్యర్థి, ముగ్గురు MLA అభ్యర్థులది ఒకే గ్రామం

image

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం బందలాయిచెరువు గ్రామానికి చెందిన నలుగురు నేతలు ప్రస్తుత ఎన్నికల బరిలో దిగుతున్నారు. అంబటి రాంబాబు పల్నాడు(D) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన సోదరుడు అంబటి మురళి గుంటూరు(D) పొన్నూరు MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ MLA సింహాద్రి రమేశ్ బాబు మరోసారి పోటీకి సిద్ధం కాగా, సింహాద్రి చంద్రశేఖరరావు బందరు MP అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

News March 23, 2024

గుంటూరు టీడీపీ MP అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థినిపై కేసులు

image

గుంటూరులోని అమరావతి రోడ్డు వేలంగిని నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రచారం చేసి, ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యారంటూ టీడీపీ నేతలపై కేసు నమోదైంది. శుక్రవారం టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, సీనియర్ కోవెలమూడి రవీంద్ర ప్రచారం నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రచారం చేశారని వీరితో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

News March 23, 2024

కృష్ణా: హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 23, 25 తేదీల్లో సత్రాగచ్చి(SRC), సికింద్రాబాద్(SC) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23న నెం.07645 SC- SRC, ఈ నెల 25న నెం.07646 SRC- SC మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఏపీలో ఈ రైళ్లు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు విజయవాడ, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News March 23, 2024

MCMC అనుమతి తప్పనిసరి: చిత్తూరు కలెక్టర్

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల ప్రచారానికి మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి అని చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ అన్నారు. మీడియాలో వచ్చే ఎన్నికల ప్రచారం నిబంధనలకు లోబడి ఉందా లేదా అని పరిశీలించి ఫ్రీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను వరుస క్రమం ప్రకారం అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

News March 23, 2024

VZM: ‘సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సేల్స్ తగ్గింపు’

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సేల్స్ తగ్గిస్తామని జిల్లా ఐఎంఎల్ డిపో మేనేజర్ ఎన్ వి రమణ వెల్లడించారు. నెల్లిమర్ల ఐఎంఎల్ డిపోలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిపో పరిధిలో ఉన్న 279 మద్యం షాపులకు సంబంధించి గత ఏడాది కన్నా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సేల్స్ తగ్గిస్తామని చెప్పారు. డిపో పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించనున్నట్లు చెప్పారు.

News March 23, 2024

విశాఖ: ‘సీఎం, మంత్రుల ఫోటోలు ఉండకూడదు’

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయాలని జిల్లా ఎన్నికల అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆర్.ఓలను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి జారీ చేయబడే విద్యుత్, తాగునీరు, ఇతర బిల్లులపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ ప్రతినిధుల ఫొటోలు గాని, వారి సందేశాలు గాని ఉండకూడదని స్పష్టం చేశారు.

News March 23, 2024

‘ఎలక్ట్రానిక్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత పరచండి’

image

ఏప్రిల్ మూడో తేదీ సీజర్స్ అంశంపై సిఎస్, డిజిపి లతో భారత్ ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృతస్థాయిలో మెరుగుపరచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సత్యసాయి జిల్లా అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని, జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలన్నారు.

News March 23, 2024

శ్రీకాకుళం: ప్రచారాలకు అనుమతులు తప్పనిసరి

image

జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ శుక్రవారం వెల్లడించారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న సమావేశాలకు, లౌడ్‌స్పీకర్లకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అభ్యర్థులు ఒక వాహనానికి నియోజకవర్గంలో తిరగడానికి తీసుకున్న అనుమతి ఆ నియోజకవర్గంలో మాత్రమే ఆ వాహనాన్ని వినియోగించాలన్నారు.