India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో. జిల్లాలోని పాలకొల్లులో 1955 నుంచి 2019 వరకు మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడూ హ్యాట్రిక్ విజయం నమోదుచేయలేదు. అయితే 2014, 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన నిమ్మల రామానాయుడు వరుస విజయాలు సాధించారు. తాజాగా మరోసారి ఆయన అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఈ సారి గెలిస్తే పాలకొల్లు చరిత్రలో హ్యాట్రిక్ రికార్డు ఆయన సొంతమవుతుంది. మరి విజయం సాధించేనా..?
గుండెపోటుకు గురై మృతి చెందిన తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే కన్నీళ్లు దిగమింగుకుంటూ బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదవ తరగతి పరీక్షకు హాజరైన విషాద సంఘటన శుక్రవారం పార్వతీపురం మండలంలో జరిగింది. నర్సిపురం గ్రామానికి చెందిన వినయ్ అనే విద్యార్థి తండ్రి ఎన్. సీతారాం(45) శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఇంటి వద్దే మృతి చెందాడు. కుమారుడు వినయ్ పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత అంత్యక్రియలకు హాజరయ్యాడు.
గన్నవరం YCP కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. TDP నిర్వహించనున్న వర్క్‌షాపులో పాల్గొనేందుకు కడప TDP ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి విజయవాడ వచ్చారు. గన్నవరం మీదుగా వెళ్తూ అక్కడి వైసీపీ కార్యాలయం వద్ద బ్యానర్లను ఫొటోలు తీస్తుండగా ఆ పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న TDP కార్యకర్తలు అక్కడకు చేరుకోగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కుప్పం మండలం బురడ సిద్దనపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మురుగేష్ కుమారుడు రాజశేఖర్ ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. మద్యాహ్నం మేకలకు మేత కోసం వెళ్లినప్పుడు పొలం వద్ద కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు పొరపాటున తగిలి రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కావలి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున రైలు ఢీకొని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ అరుణ పోలీసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ రైలు ట్రాక్‌ను దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఉండొచ్చన్నారు. మహిళ వయస్సు 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. మృతురాలి దేహంపై రోజ్ కలర్ చుడీదార్, వైట్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ చున్నీ ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలన్నారు.
ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి అని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్‌ను అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు.
‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును TDP అధిష్టానం కృష్ణ ప్రసాద్‌కు కేటాయిస్తూ ప్రకటన చేయడంతో ఆమె నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులను నమోదు చేస్తున్నట్లు విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లాలో శుక్రవారం వరకు 12 ఉల్లంఘన కేసులను నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇందులో విజయనగరం-3, ఎస్.కోట-3, రాజాం-2, నెల్లిమర్ల-2, చీపురుపల్లి-1, బొబ్బిలి-1 నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లాలోని 9 చెక్ పోస్టుల వద్ద పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ రవి పట్టం శెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణం నుంచి గ్రామాల వరకు ఎక్కడ ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. నియమావళి అమలు, పరిశీలన పట్ల అధికారులు నిశితంగా గమనించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి పాల్గొన్నారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యాపారానికి TDP నేతలే డాన్‌లనే విషయం విశాఖ పోర్టు ఘటన ద్వారా తేటతెల్లమైందని రాజమండ్రి సిటీ వైసీపీ MLA అభ్యర్థి భరత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూనం కోటయ్య చౌదరి, వీరభద్రరావు కొకైన్ కేసులో కీలకమని తెలుస్తోందన్నారు. విశాఖపోర్టులో 25వేల కిలోల డ్రైఈస్ట్‌తో కలగలిపి కొకైన్‌ను అధికారులు గుర్తించారన్నారు. పట్టుబడిన వారు టీడీపీ నేత లోకేష్‌కు, బాలకృష్ణ వియ్యంకుడన్నారు.
Sorry, no posts matched your criteria.