India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలకు సన్నిహితుడిగా పేరు ఉన్న జంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన
టీడీపీలో చేరి గురజాల, నరసరావుపేటలలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే టీడీపీ ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఈ నేపథ్యంలో జంగా రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
కడప జిల్లాలో ఈ నెల 31 తేదీన చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటించినట్లు టీడీపీ అధిష్ఠానం వెల్లడించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో 30వ తేదీన మైదుకూరులో ప్రజాగళం సమావేశంతో పాటు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలోని టీడీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు తెలిపారు.
పోలవరంలో 1999 అసెంబ్లీ ఎన్నికలు ఓ రికార్డు సొంతం చేసుకున్నాయి. అప్పుడు TDPనుంచి పోటీ చేసిన వంకా శ్రీనివాస రావు కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి బి.దుర్గారావుపై కేవలం 24 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలవరం చరిత్రలో ఇదే అత్యల్ప మెజారిటీ. 2019లో YCP నుంచి బరిలో నిలిచిన తెల్లం బాలరాజు ఎన్నడూ లేనంతంగా 42070 అత్యధిక మెజారిటీ సాధించగా ప్రస్తుతం ఆయన సతీమణి బరిలో ఉన్నారు. TDP- జనసేన- BJP కూటమి అభ్యర్థి తేలాల్సి ఉంది.
ఎన్నికల కమీషన్ సూచనల మేరకు సాధారణ ఎన్నికలు – 2024 దృష్ట్యా జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి శుక్రవారం సాధారణ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై ఆయా శాఖల జిల్లా, మండల, క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ భవిష్యత్త్‌పై సందిగ్ధత నెలకొంది. నేడు ప్రకటించిన టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉంటుందని అభిమానులు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూశారు. కానీ ఉమా పేరు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన దేవినేని ఉమాకు సీటు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చేస్తున్నారు.
పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా దాచేపల్లికి చెందిన కరాలపాటి జానీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ అధ్యక్షులు తులసి రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జానీ శుక్రవారం దాచేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న తనను గుర్తించి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గానికి ‘పర్వత’ కుటుంబం ఐదుగురు MLAలను అందించింది. 1955లో పర్వత గుర్రాజు గెలవగా, ఆయన వారసుడు పర్వత సుబ్బారావు 1994లో గెలిచారు. సుబ్బారావు భార్య బాపనమ్మ 1999లో విజయం సాధించారు. ఆమె కుమారుడు పర్వత సత్యన్నారాయణ మూర్తి 2009లో గెలుపొందారు. అదే కుటుంబం నుంచి పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌కి 2019లో విజయం దక్కింది. దీంతో ఆ కుటుంబం నుంచి ఐదుగురు నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టినట్లయింది.
న్యూ ఢిల్లీలో 18 నుంచి 22 వరకు జరిగిన అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో సిహెచ్. మహేశ్ కాంస్య పతకం సాధించాడు. మహేశ్ విజయవాడలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పవర్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సిబ్బంది, సహచరులు అభినందించారు.
కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. వెంకట ప్రసాద్‌పై గతంలో సీబీఐ, హైదరాబాద్ కోర్టు విధించిన ఐదు, ఏడు సంవత్సరాల శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇవాళ తీర్పు వెల్లడించింది. క్రిమినల్ ఆపిల్ నెంబర్ 454/2016, 1382/2017లను అనుమతిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన శిక్షణ హైకోర్టు రద్దు చేసింది.
ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పరిధిలో పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు మీడియం ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు angrau.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.
Sorry, no posts matched your criteria.