Andhra Pradesh

News March 22, 2024

TDP లిస్ట్.. అమలాపురం, కాకినాడ సిటీ అభ్యర్థులు వీరే!

image

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. అమలాపురం MLA అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ సిటీ MLA అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావును అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. అమలాపురంలో వైసీపీ అభ్యర్థి పినిపె విశ్వరూప్‌.. కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా.. 2019లోనూ ఈ రెండు చోట్ల వీరే ప్రత్యర్థులు కాగా, ఈసారి ఎవరు నెగ్గుతారో చూడాలి.

News March 22, 2024

ఉమ్మడి ప.గో నేతల్లో టెన్షన్.. ఆ ‘ఒక్కరు’ ఎవరు..?

image

TDP అభ్యర్థుల మూడో లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాలోనూ పోలవరం టికెట్‌పై సందిగ్ధత వీడలేదు. ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇప్పటికే అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కూటమి తరపున సైతం పోలవరం మినహా.. 14 చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా, పోలవరం నుంచి మాత్రం ఏ పార్టీ బరిలో ఉంటుంది..? ఎవరు పోటీ చేస్తారు..? అనే ఉత్కంఠ వీడటం లేదు. దీంతో అటు క్యాడర్‌లో టెన్షన్.. ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

News March 22, 2024

టీడీపీ మూడో జాబితా.. ఎస్.కోట అభ్యర్థిగా లలిత!

image

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మూడో జాబితాలో ఎస్.కోట నుంచి కోళ్ల లలిత కుమారికి స్థానం దక్కింది. ఆమె 2009,14లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో కడుబండి శ్రీనివాసరావుపై ఓడిపోయారు. వైసీపీ నుంచి ఈసారి కూడా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఇప్పటికే 2014, 2019లో తలపడిన వీరి మధ్య మరోసారి పోటీ నెలకొంది. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారని మీరు భావిస్తున్నారు. కామెంట్ చేయండి.

News March 22, 2024

పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకుకి ఎంపీ టికెట్

image

కడప జిల్లా వ్యక్తికి టీడీపీ ఏలూరు ఎంపీ టికెట్‌ను కేటాయించింది. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ యాదవ్‌ను టీడీపీ అధిష్ఠానం ఏలూరు ఎంపీ స్థానానికి బరిలో నిలిపింది. 13 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఆయనను బరిలో నిలిపినట్లు తెలుస్తోంది.

News March 22, 2024

విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ

image

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. అటు వైసీపీ నుంచి కేశినేని నాని బరిలోకి దిగుతుండగా.. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తి నెలకొంది. కాగా 2022లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్ని తొలిసారి పోటీచేస్తున్నారు. అటు గత ఎన్నికలో టీడీపీ తరఫున పోటీచేసి నెగ్గిన నాని ఈసారి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలో విజయవాడలో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా లావు

image

టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలును ప్రకటించారు. 2019లో ఆయన ఇదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇటీవల టీడీపీలో చేరగా.. ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ చేయనున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

శ్రీకాకుళానికి శంకర్, పలాస నుంచి గౌతు శిరీషా

image

TDP మూడో అభ్యర్థుల జాబితాలో.. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం MLA అభ్యర్థిగా గొండు శంకర్, పాతపట్నం నుంచి మామిడి గోవింద్ కుమార్, పలాస నుంచి గౌతు శిరీషా ఖరారయ్యారు. కాగా శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, MLA అభ్యర్థిగా వైసీపీ ధర్మాన ప్రసాద్ ఉన్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి, పలాసలో సిదిరి అప్పలరాజు బరిలో ఉన్నారు.

News March 22, 2024

రిటైర్డ్ IRSకే చిత్తూరు MP టికెట్

image

టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావును ప్రకటించారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన తొలిసారి ఎంపీ బరిలో నిలవనున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ కేటాయించినట్లు తెలుస్తోంది. అక్కడ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

News March 22, 2024

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి

image

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కురవ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఆయన 1996లో ఉమ్మడి అనంత జడ్పీ ఛైర్మన్‌గా, 1999లో హిందూపురం ఎంపీగా, 2009, 2014లలో వరసగా పెనుకొండ ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారయణ చేతిలో ఓడిపోయారు.

News March 22, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా TDP MP అభ్యర్థులు వీరే..

image

టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాడు నాగరాజును ప్రకటించింది. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.