Andhra Pradesh

News March 22, 2024

ఎమ్మెల్యే శ్రీదేవి కోడ్ ఉల్లంఘన ఈసీ షోకాజ్‌లు

image

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 22 మంది లబ్ధిదారులకు బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ ఫొటోలు వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో హల్చల్ చేశాయి. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించిన ఎమ్మెల్యేకి పత్తికొండ రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి గురువారం షో కాజ్ నోటీసులు జారీ చేశారు. కోడ్ ఉల్లంఘనపై 24గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఈ నోటీసును రెవెన్యూ అధికారులు ఆమెకు అందజేశారు.

News March 22, 2024

CTR: 4 చోట్లే పాత అభ్యర్థుల మధ్య పోటీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 10 చోట్ల 2019లో తలపడిన వారు ఇప్పుడు పోటీలో లేరు. నగరిలో గాలి భాను ప్రకాశ్, రోజా.. శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి, బొజ్జల సుధీర్, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, నల్లారి కిశోర్ రెడ్డి, పలమనేరులో వెంకటే గౌడ, అమర్నాథ్ రెడ్డి మాత్రమే మరోసారి పరస్పరం పోటీ పడనున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని పోటీలో ఉన్నా.. అక్కడి YCP అభ్యర్థి మారారు.

News March 22, 2024

బాపట్ల: విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడి సస్పెండ్

image

బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న బోనిగల నవదీప్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో అతనిపై చర్యలు తీసుకుంటూ యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థిని కౌన్సిలింగ్ చేసే క్రమంలో ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయుడిని శిక్షించాలని దళిత సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతడిని సస్పెండ్ చేశారు.

News March 22, 2024

గుడ్లవల్లేరులో టీడీపీ కార్యాలయంపై దాడి

image

గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామ టీడీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయ తలుపులు పగుల గొట్టి, కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 22, 2024

అబ్బాయ్ కోసం బాబాయ్ తగ్గారా?

image

అబ్బాయి కోసం బాబాయ్ తగ్గినట్లు కనిపిస్తోంది. జమ్మలమడుగు టికెట్ కోసం BJP నుంచి ఆదినారాయణ రెడ్డి, TDP నుంచి భూపేశ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇద్దరిదీ ఒకే కుటుంబం కావడంతో జమ్మలమడుగు టికెట్ కాకుండా కడప ఎంపీ టికెట్ అడిగినట్లు టాక్. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇక్కడి నుంచి శ్రీనివాసుల రెడ్డి, వీరశివారెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని టికెట్ వరిస్తుందో చూడాలి.

News March 22, 2024

తూ.గో: NRI ఓటర్లు@1,006.. ఎగిరొచ్చేస్తారంతే!

image

ప్రపంచంలో ఏ మూలనున్నా సొంతూరు రాజకీయాలపై ఉండే ఆసక్తే వేరు. ఐదేళ్లకోసారొచ్చే ఎన్నికల పండక్కి ఎలాగైనా వచ్చి ఓటేస్తుంటారు NRI ఓటర్లు. ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,006 మంది NRI ఓటర్లు ఉంటే.. పురుషులు-790, స్త్రీలు- 215, థర్డ్ జెండర్ ఒకరు ఉన్నారు. తూ.గో జిల్లాలో 442, కాకినాడ-292, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 272 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రాజమండ్రి నుంచి అధికంగా 173 మంది ఉంటే.. తుని నుంచి ముగ్గురు ఉన్నారు.

News March 22, 2024

చింతపల్లి: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపుకు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2024

అనంత: బీటెక్ విద్యార్థినీ ఆత్మహత్య

image

అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ యువతి ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకుంది. గుంతకల్లు పట్టణం హనుమేశ్ నగర్ కు చెందిన నవ్య బీటెక్ CSE ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈక్రమంలో విద్యార్థిని హాస్టల్ గదిలో గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News March 22, 2024

ప్రకాశం: అన్నదమ్ముల దారెటు

image

ప్రకాశం జిల్లాలో ఆమంచి అన్నదమ్ములు సైలెంట్‌ ఆసక్తి రేపుతోంది. కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. 2019లో కరణం బలరాం చేతిలో ఓడిపోవడంతో ఆయన్ను పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ నియమించింది. తాజాగా పర్చూరు టికెట్ యడం బాలాజీకి కేటాయించింది. మరోవైపు ఆమంచి స్వాములు జనసేన నుంచి గిద్దలూరు టికెట్ ఆశించినా దక్కలేదు. సీటు రాని ఆమంచి సోదరులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.

News March 22, 2024

గుంటూరు: ఆర్మీ రిక్రూట్మెంట్ దరఖాస్తు గడువు నేటితో పూర్తి

image

ఆర్మీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కు సంబంధించి ఈనెల 22వ తేదీ శుక్రవారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుందని జిల్లా కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన, అర్హత ఉన్న అభ్యర్థులు జాయిన్ఇండియన్ఆర్మీ. ఎన్ఐసీ. ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.