India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బైరెడ్డిపల్లి పోలీసులను ఓ ప్రేమజంట గురువారం ఆశ్రయించారు. రామసముద్రంకు చెందిన యువకుడు, తీర్థం గ్రామానికి చెందిన యువతి ప్రేమవివాహం చేసుకున్నారు. ఇరువురి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమికుల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరు మేజర్లు కావడంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు.
తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోడానికి వెళ్లిన దాసరి సిద్దు(7) అనే బాలుడు ప్రమాదవశాత్తు స్నానాలు చేసే నీళ్ల ట్యాంకులో పడి మృతి చెందిన సంఘటన భోగాపురం మండలం దెబ్బలపాలెంలో చోటుచేసుకుంది. బొబ్బిలికి చెందిన దాసరి నరసింహారావు భార్యాబిడ్డలతో కూలి పనుల కోసం భోగాపురం వచ్చారు. వారు పనులు చేస్తుండగా కుమారుడు ఆడుకోవడానికి వెళ్లి ట్యాంక్‌లో పడి చనిపోయాడని వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే క్రిమినల్ కేసులో నమోదు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి 4 రోజులు గడిచినా ఎన్నికల కోడ్‌కు సంబంధించి ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. పోస్టర్స్, హోర్డింగ్స్, బ్యానర్స్ ఈపాటికే తీసేసి ఉండాల్సిందన్నారు. ఇప్పటికి తీసేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
గుంటూరు రూరల్ మండలం పెద్దపలకలూరు గ్రామపంచాయతీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ కోసం తీసిన గుంతలో పడి చిన్నారి మృతిచెందింది. ఓ ప్రైవేట్ కాలేజీ సమీపంలోని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ఆరేళ్ల కుమార్తె గుంతలో పడి చనిపోగా, నల్లపాడు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న వారు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబానిది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఓ గ్రామం.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.మాధవిరెడ్డికి గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కడప రెవెన్యూ డివిజన్ అధికారి & రిటర్నింగ్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం మాధవిరెడ్డి సోషల్ మీడియాలో ఎంసీసీని ఉల్లంఘిస్తూ అభ్యంతరకరమైన పోస్టును విడుదల చేయడంపై షోకాజ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు.
కాకినాడ భానుగుడి సెంటర్లో కోటగిరి సిటీ కాంప్లెక్స్‌లోని ఈసా స్పా సెంటర్లో బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని కాకినాడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కత్తాకు చెందిన ఒక మహిళతో పాటు ఇద్దరు విటులను, ఇద్దరు స్పా సెంటర్ నిర్వాహకులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. వారిని కోర్టుకు తరలించగా 14 రోజులు రిమాండ్ విధించారని టౌన్ సీఐ నాయక్ తెలిపారు.
కడప: యోగి వేమన విశ్వవిద్యాలయం ఏప్రిల్ మాసంలో జరప తలపెట్టిన స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పి.హెచ్.డి పట్టాలు పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు గడువు పొడిగిస్తున్నట్లు వీసీ వెల్లడించారు. ఇప్పటిదాకా వివిధ డిగ్రీల పట్టాల కోసం 8,898 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
కోటబొమ్మాళి మండలం విశ్వనాధపురం గ్రామంలోని ఓ కొండ సమీపంలో గురువారం గుర్తుతెలియని అస్థిపంజరం గ్రామస్థుల కంటపడింది. దీంతో గ్రామస్థులు స్థానిక వీఆర్వో పైల దాలప్పకు సమాచారం ఇవ్వటంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలు గురయ్యారు.
తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని జయనగర్ కాలనీకి చెందిన రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బైక్ డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తవణంపల్లిలో చోటుచేసుకుంది. SI సుధాకర్ రెడ్డి వివరాల మేరకు.. చిత్తూరులోని కట్టమంచి కంది కాలమ్మ గుడి వీధికి చెందిన రామన్ (60) బైక్‌పై వెళ్తుండగా కె. పట్నం ఫ్లైఓవర్ వద్ద అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అతని భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.
Sorry, no posts matched your criteria.