India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమల శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24, 25న జరుగనుంది. తీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తుంబురు తీర్థంలోకి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. మరుసటి రోజు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
గ్రామ సేవకుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుర్రం నాగయ్య గురువారం మృతి చెందారు. బుధవారం సాయంత్రం నాగయ్య తన ఇంటి ముందు రోడ్డు దాటుతుండగా మోటారు సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామ సంఘం నాయకులు సంతాపం తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ గురువారం పాతపట్నం మండలంలో పర్యటించారు. పాతపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికలు సజావుగా సాగేందుకు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎన్నికల్లో అవలంబించిన విధివిధానాలను అధికారులకు వివరించారు.
కోడుమూరు నియోజవకర్గానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో TDP ఒక్కసారి మాత్రమే గెలిచింది. 1962లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పీఆర్ రావుపై కాంగ్రెస్ అభ్యర్థి డీ.సంజీవయ్య విజయం సాధించారు. మొత్తం 8సార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే.. 1983లో తొలిసారి బరిలో నిలిచిన TDP పరాజయం పాలైంది. 1985లో TDP అభ్యర్థి ఎం.శిఖామణి మాత్రమే విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో గెలుస్తుందో లేదో కామెంట్ చేయండి.
ఉగాది పురస్కారాలకు పల్నాడు జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్ర రాజు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేస్తుంది. ఈ క్రమంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి సిఫారసు మేరకు ఉత్తమ సేవలు అందించిన రామచంద్ర రాజుకు ప్రభుత్వం 2024 ఉత్తమ సేవా పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా బుధవారం అధికారులు, సిబ్బంది ఆయన్ను అభినందించారు.
డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లా మండపేట నియోజకవర్గ MLA అభ్యర్థిగా ‘నవతరం పార్టీ’ నుంచి దివ్యాంగుడు నందికోళ్ల రాజు బరిలో ఉన్నారు. కాగా ఆయన గురువారం మండలంలోని తాపేశ్వరం గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేశాయో యువత గమనించాలన్నారు.
లక్కిరెడ్డిపల్లె మండలంలోని కస్తూరురాజుగారిపల్లి కస్పాకు చెందిన వంటేరు లక్ష్మీదేవి(27) గురువారం తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం కొరకు లక్ష్మీదేవి మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రత్తిపాడు అసెంబ్లీ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రామాంజనేయులుపై దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు గురువారం గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కావాలని వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని వివరించారు.
విజయవాడ వెస్ట్ కూటమి టికెట్‌పై వివాదం ముదురుతోంది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో జనసేన టికెట్ తనదే అని అన్నారు. టికెట్ ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వెల్లంపల్లిపై, బీజేపీ సెంట్రల్‌లో పోటీ చేయాలన్నారు. నిన్న పవన్‌ను కలిసినప్పుడు ఈ విషయం చెప్పినట్లు వివరించారు.
బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన గుత్త శ్రీనివాసులు YCPని వీడి TDPలో చేరారు. ఈసందర్భంగా రేబాల గ్రామంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఆయన నిన్న ఎమ్మెల్యే ప్రసన్న, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో YCPలో చేరిన విషయం తెలిసిందే. ఆయన వెంట TDP నాయకులు సురా శ్రీనివాసులురెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పుట్ట సుబ్రహ్మణ్యంనాయుడు, హరికృష్ణ తదితరులు ఉన్నారు
Sorry, no posts matched your criteria.