India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. సీ విజిల్ ఫిర్యాదులను 100% పరిష్కరించాలని సూచించారు. గురువారం ఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి 4 రోజులు గడిచినా ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, వీటిపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని పోలీసులు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జల్లెడ పట్టారు. రహదారులు, ప్రధాన కూడళ్ళలో వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు ,ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు నిర్వహించారు.
అమలాపురం రాజకీయం రసవత్తరంగా మారింది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ వైసీపీలో కొనసాగుతుండగా ఆమె భర్త టీఎస్ఎన్ మూర్తి బీజేపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. బీజేపీలో చేరిన మూర్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరిని గురువారం కలిశారు. పి.గన్నవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా మూర్తి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 24, 25న రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు వస్తారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశమై ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారన్నారు.
కామవరపుకోట మండలంలో ఓ మైనర్ బాలికపై దేవాదాయ శాఖ ఉద్యోగి లక్ష్మీ నరసింహారావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు బంధువుల ఫిర్యాదు మేరకు గురువారం తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు ఎండోమెంట్ పరిధిలో నరసింహారావు ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈనెల 18వ తేదీన పులివెందులలోని నగిరిగుట్టలో జరిగిన రెంటాల బాబు హత్య కేసులో ముద్దాయి రెంటాల సురేశ్‌ను అరెస్టు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ శంకర్ రెడ్డి చెప్పారు. రెంటాల అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి ముద్దాయిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. కూర వేయలేదనే కారణంతో బాబుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని వివరించారు.
సంతమాగులూరుకు చెందిన బాలుడిపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బెల్లంకొండ మండలంలోని వెంకటాయపాలేనికి పనుల నిమిత్తం సంతమాగులూరు నుంచి బాలుడి కుటుంబ సభ్యులు ఇటీవల వలస వెళ్లారు. ఈ క్రమంలో వెంకటాయపాలేనికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల వైసీపీకి దూరమైన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తిరుపతి ఎంపీ పోటీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరిని కలిశారు. ఆయినప్పటికీ ఆయన సీటుపై ఎలాంటి భరోసా ఇవ్వలేదని సమాచారం. తాజాగా ఆయన ఢిల్లీ బాట పట్టారు. అక్కడ ఆయనకు ఉన్న పరిచయాలతో తిరుపతి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు లాబీ చేస్తున్నారని తెలుస్తోంది.
మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్‌కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.
టీడీపీ వచ్చాక పాలకొల్లులో 9 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు ఆ పార్టీ,2 సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. ఈసారి పాలకొల్లులో విజయం ఏ పార్టీది అనే చర్చ సాగుతోంది. 1983,1985,1994,1999, 2004, 2014, 2019లలో టీడీపీ గెలిచింది. 1989, 2009లో కాంగ్రెస్ గెలిచింది. కాగా ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, వైసీపీ నుంచి గుడాల గోపి పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనే దానిపై మీ కామెంట్.
Sorry, no posts matched your criteria.