Andhra Pradesh

News March 21, 2024

ప .గో జిల్లా వాలంటీర్లకు హెచ్చరిక

image

జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రచారాలు చేసుకోవాలన్నా, పోస్టర్లు వేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరని కలెక్టర్ సుమిత్ రాజకీయ పార్టీ నాయకులకు తెలిపారు. ఇందులో ముఖ్యంగా వాలంటీర్లు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న, పార్టీ కండువాలు వేసుకున్నా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2024

సూళ్లూరుపేట ఘటనలో ఇద్దరు మృతి

image

సూళ్లూరుపేట మదీనా టపాసుల గోడౌన్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చెన్నైకి తరలించారు. ఇందులో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకుమార్, రవి శరీరం 90 శాతం కాలిపోయింది. వీళ్లు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సూళ్లూరుపేట ఎస్ఐ రహీం వెల్లడించారు. మిగిలిన వారికి ఎలాంటి ప్రాణపాయం లేదని స్పష్టం చేశారు.

News March 21, 2024

ఎన్నికల ప్రధానాధికారి ముందుకు నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) ముఖేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 4గం.లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలన్నారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేదని..? విచారణలో ఏం తేలింది.? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఎస్పీని CEO ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎస్పీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని CEO తెలిపారు.

News March 21, 2024

కొత్తపేటలో జగ్గిరెడ్డి హ్యాట్రిక్ కొడతారా?

image

కొత్తపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా బరిలో చిర్ల జగ్గిరెడ్డి ప్రస్తుతం ఐదోసారి పోటీలో ఉన్నారు.2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2009లో ఓటమి చెందారు. 2014, 2019లో వైసీపీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించారు. పోటీ చేసిన నాలుగు సార్లు, ప్రస్తుతం కూడా ఆయన ప్రత్యర్థి బండారు సత్యానందరావు కావడం విశేషం. మరి జగ్గిరెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా? కామెంట్ చేయండి.

News March 21, 2024

ప్రచారాల్లో పాల్గొనే వాలంటీర్ల తొలగింపుకు చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాజకీయ పార్టీల కార్యక్రమంలో పాల్గొనే వాలంటీర్లను తొలగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులతో పాటు గౌరవ వేతనాలు తీసుకుంటున్న వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనరాదని చెప్పారు. 

News March 21, 2024

ప్రకాశం: వాలంటీర్లకు హెచ్చరిక

image

జిల్లాలో ఇటీవల ఎన్నికల కోడు అమలులోకి వచ్చింది. దీంతో ప్రచారాలు చేసుకోవాలన్నా, పోస్టర్లు వేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరని కలెక్టర్ దినేశ్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులకు తెలిపారు. ఇందులో ముఖ్యంగా వాలంటీర్లు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న, పార్టీ కండువాలు వేసుకున్నా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో కొంతమంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

News March 21, 2024

తేలినీలాపురంలో చుక్కల దుప్పి మృతి

image

తేలినీలాపురం విదేశీపక్షుల విడిది కేంద్రంలో గురువారం ఒక చుక్కల దుప్పి మృతి చెందింది. కొద్దిరోజుల క్రితం నందిగం మండలం రాంపురం సమీపంలోని తెట్టంగి పంట పొలాల్లో ఇరుక్కున్న దుప్పిని గ్రామస్థుల సమాచారంతో అటవీశాఖ అధికారులు తేలినీలాపురం విడిది కేంద్రంలో ఉంచారు. ఈ క్రమంలో గురువారం దుప్పి అస్వస్థతకు గురై మృతి చెందింది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

News March 21, 2024

TPT: ఓటు ఫ్రం హోం.. ఇలా చేయండి

image

తొలిసారిగా 85 ఏళ్ల పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం ఉన్నవారు ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. తాజా వివరాల ప్రకారం తిరుపతి జిల్లాలో 7,940 మంది వృద్ధులు, 24,481 మంది దివ్యాంగులు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల లోపు వీరంతా ఫారం12-డీ ద్వారా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. మీ సమీపంలోని బీఎల్వోలను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.

News March 21, 2024

డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

అనంతపురం లోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజులు చెల్లింపునకు ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోపు ఫీజు చెల్లించాలన్నారు.

News March 21, 2024

నరసరావుపేట: ‘ఆ యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి’

image

ఎన్నికల కమిషన్ తెచ్చిన యాప్‌లలో ముఖ్యమైన సీ విజిల్ యాప్‌ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కోరారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. సీ విజిల్ యాప్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. మద్యం, నగదు వంటివి పంపిణీ చేసిన లైవ్ ఫోటోలు, వీడియోలు ఈ యాప్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. యాప్‌లో పెట్టిన ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కారం చేయడం జరుగుతుందని చెప్పారు.