India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని శ్రీకాకుళం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని నమూన్ ఆదేశించారు. బుధవారం ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట పట్టణాల్లో సాధారణ ఎన్నికల కోసం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ బుధవారం తణుకులో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తణుకు పట్టణానికి విచ్చేసిన ఆమె.. స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. వెంకటరామయ్య థియేటర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి రష్మి గౌతమ్ విచ్చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.
జిల్లాలో ఎన్నికల వేళ ఎక్కడైనా ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు ఆగడాలు, దౌర్జన్యాలు చేస్తున్నా, పాత పంథా కొనసాగిస్తున్నా, ఏదైనా హింస, అల్లర్లు, గొడవలకు పాల్పడుతున్నా వెంటనే తమకు ఈ నంబర్ ద్వారా 9440796800 సమాచారం పంపాలన్నారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించడంతోపాటు ఎన్నికలు పూర్తయ్యే వరకు నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఎన్నికల అధికారులకు సూచించారు. కొండపి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎన్నికల కమిషన్ నిబంధనలపై మండల స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అలాగే రిటర్నింగ్ అధికారులందరూ తమ బృందాల్లోని అధికారులను సిద్ధం చేయాలని తెలిపారు.
ఏలూరు జిల్లాలో బుధవారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగు పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో చోదిమెళ్ల శివారులో పిడుగు పడగా.. పొలం పనులు చేస్తున్న సుబ్బారావు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులు బోరున విలపించారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం లలిత రైస్ ఇండస్ట్రీలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. లారీ వెనక్కి తీస్తుండగా క్యాబిన్‌కు-గోడకు మధ్య చిక్కుకొని కామేశ్వరి(60), నాగరత్నం(65) మృత్యువాత పడ్డారు. వర్షం వస్తోందని గోడ పక్కన నిలుచున్న వీరిని లారీ ఢీ కొట్టింది. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిట్వేల్ మండలం దొగ్గలపాడుకు చెందిన కొండ్రెడ్డి నర్సింహా రెడ్డి (56) కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందిందని రాజంపేట పట్టణ ఎస్సై తెలిపారు. ఈ నెల 13 నుంచి వృద్ధుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తెల్ల రంగు పంచ, చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 91211 00570కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు.
రాయగడ నుంచి విశాఖ వచ్చిన రైలులో బుధవారం ఓ గర్భిణి ప్రసవించింది. మతిస్థిమితం లేని మహిళకు పురుటి నొప్పులు రాగా.. రైల్వే పోలీసులు 108కు సమాచారం అందించారు. స్పందించిన కంచరపాలెం 108 మెడికల్ టెక్నీషియన్ శైలజ, పైలెట్ అప్పారావు హుటాహుటిన రైలు వద్దకు వెళ్లి.. నొప్పులు ఎక్కువ కావడంతో రైలులోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లీ బిడ్డలను కేజీహెచ్‌కు తరలించారు. 108 జిల్లా కో-ఆర్డినేటర్ సురేష్ వారిని అభినందించారు.
భారత్–యూఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంప్–2024 విన్యాసాల్లో పాల్గొనేందుకు యూఎస్‌కు చెందిన యుద్ధ విమానాలు బుధవారం ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకున్నాయి. ఈ అధునాతన, బహుముఖ యుద్ధ విమానాలు భారత నావికాదళం, వైమానిక దళాలతో కలిసి విన్యాసాలు చేయనున్నాయి. భారత్, యూఎస్ రక్షణ రంగ సంబంధాలు మరింత పెంపొందించేందుకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు.
బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన టిడిపి ముఖ్య నాయకుడు గుత్తా శ్రీనివాసులు బుధవారం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మండలపార్టీ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి, బుచ్చి నగర సచివాలయాలు కన్వీనర్ మోర్ల మురళి, 14 వార్డుకౌన్సిలర్ ప్రసాద్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.