Andhra Pradesh

News March 20, 2024

తిరుపతి జూ నుంచి నల్లమల అడవికి మూడు పులి పిల్లలు

image

నంద్యాల జిల్లాలో జనావాసాల మధ్య దొరికిన నాలుగు పులి పిల్లలు ప్రస్తుతం తిరుపతి ఎస్‌వీ జూలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు పులి పిల్లల్ని నల్లమల అభయారణ్యానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేసి పులి పిల్లలకు వేటాడటం నేర్పించేందుకు తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ప్రయోగాత్మకంగా దీనిని చేపట్టారు.

News March 20, 2024

తిరుపతి రీజియన్‌లో BOB 3 కొత్త బ్రాంచ్‌లు ప్రారంభం

image

భారతదేశంలోని 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజియన్ లో రాయచోటి, వీరబల్లి, జమ్మలమడుగులో (50, 51, 52 వ బ్రాంచీలు) 3 కొత్త బ్రాంచ్ కార్యాలయాలను NDGM-1 గోవింద్ ప్రసాద్ వర్మ ప్రారంభించారు. AGM & రీజినల్ హెడ్ P.అమరనాథ రెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ B.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. తమ సేవలను సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరిస్తామని తెలిపారు.

News March 20, 2024

మదనపల్లె: పెళ్లయిన ఆరు నెలలకే ఆత్మహత్యాయత్నం

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు ఇందిరా నగర్లో కాపురం ఉంటున్న వెంకటేశ్ స్థానికంగా ఉన్న శ్రీకళ(20)ని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను మదనపల్లికి తరలించారు.

News March 20, 2024

రత్నం భౌతికకాయానికి వీపీఆర్ దంపతుల నివాళి

image

రత్నం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు కేవీ రత్నం భౌతికకాయానికి నెల్లూరు హరనాథపురంలోని ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యారంగానికి రత్నం అందించిన సేవలను స్మరించుకున్నారు. వీరి వెంట రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News March 20, 2024

విశాఖ: ప్రవర్తన నియమావళిని విధిగా పాటించాలి

image

అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని విధిగా పాటించాలని విశాఖ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి మల్లికార్జున సూచించారు. సిరిపురం చిల్డ్రన్ ఏరీనాలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులకు ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు.

News March 20, 2024

‘అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం’

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాల ద్వారా ఎలుగుబంటి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. దీంతో భక్తులకు రక్షణ కల్పించేందుకు టీడీపీ తక్షణ చర్యలు చేపట్టింది. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తీని పెంచింది. ఒంటరిగా మెట్లదారిలో రావొద్దని, గ్రూపులుగా మాత్రమే రావాలని సూచించింది.

News March 20, 2024

ఏలూరు జిల్లాలో హత్యాయత్నం.. గొడ్డలితో దాడి

image

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొత్తూరులో ఓ వ్యక్తిపై గొడ్డలి దాడి జరిగింది. గ్రామానికి చెందిన చిచ్చడి కృష్ణ(45) అనే వ్యక్తిపై కుర్సం వెంకటేష్ మంగళవారం రాత్రి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణ తీవ్ర గాయాలపాలవ్వగా.. చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

News March 20, 2024

వట్టిచెరుకూరు: కోడ్ పాటించని ఆటోపై కేసు నమోదు

image

వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆటోపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పదకొండున్నర‌కు ముట్లూరులో టీడీపీ, జనసేన పార్టీల తరఫున ప్రచారం చేస్తుండటంతో వాహనంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.

News March 20, 2024

ఆదోని: రైలు పట్టాలపై మృతదేహం లభ్యం

image

ఆస్పరి-మొలగవల్లి ఆర్ఎస్ఎల్ఏ మధ్య కెఎం నెంబర్ 470/28 రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు. సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని, 3 రోజుల క్రితం రైలు నుంచి జారి పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెంది ఉంటాడని పోలీసుల అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉందని, గుర్తుపట్టలేని స్థితిలో ఉందని అన్నారు.

News March 20, 2024

విశాఖలో లక్ష్మీనారాయణ మద్దతు కోరిన ఎంవీవీ..!

image

విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రచారంలో అరుదైన ఘటన నెలకొంది. విశాఖలోని జీవీఎంసీ 19వ వార్డు ఎంపీపీ కాలనీ సెక్టార్ 12లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంవీవీ జయభారత్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణను కలిసి తమకు మద్దతు తెలపాలని ఆయనకు పార్టీ కరపత్రాన్ని ఇచ్చి ఎంవీవీ అభ్యర్థించారు.