India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి, నందిగాం మండలంలోని వంశధార ప్రధాన కాలువలను బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు. సాయంత్రం 5 గంటలకు టెక్కలి టౌన్‌లోని వంశధార కాలువలను, 6 గంటలకు నందిగాంలో వంశధార కాలువను పరిశీలించనున్నట్లు తెలిపారు. కావున సాయంత్రం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడు అందుబాటులో ఉండరని క్యాంపు కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు.
విజయవాడ సచివాలయంలో బుధవారం శాసన సభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన మంత్రికి సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు.
గంజాయి, అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపుతామని వంగలపూడి అనిత హెచ్చరించారు. హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్చాల్సి ఉందన్నా ఆమె..పోలీస్ స్టేషన్లలో సదుపాయాలను పెంచుతామన్నారు. ఈ ఐదేళ్లలో పనిచేసిన వారు మాత్రమే ఉంటారని హెచ్చరించారు. చట్ట ప్రకారం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. లా&ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు.
రాజమండ్రి రూరల్ MLA బుచ్చయ్య చౌదరికి ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఓ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘42 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేం పెద్ద పోస్టు కాదు’ అని అన్నారు. పదవి ఉన్నా లేకపోయినా తన నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని అన్నారు. ఎక్కడైనా గెలవగల సత్తా తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఆ ధైర్యాన్ని ప్రజలు ఇచ్చారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం బాపట్లలో పర్యటించారు. పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల స్నాతకోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కళాశాల వద్ద ఆయనకు పోలీస్ అధికారులు, ఎన్సీసీ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
రాష్ట్రంలో 2 MLC సీట్ల భర్తీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు వీటి కోసం పోటీ పడుతున్నారు. జనసేన కోసం తిరుపతిలో సుగుణమ్మ తన టికెట్ వదులుకున్నారు. అలాగే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు MLA బొజ్జల సుధీర్ రెడ్డి కోసం పనిచేశారు. పార్టీ కోసం కష్టపడిన ఇలాంటి వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వాళ్ల అనుచరులు కోరుతున్నారు.
చింతలపూడికి చెందిన మందగుల కనకలింగ వీరబ్రహ్మం తన చేతికళతో టేకుచెక్కపై అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన ఆయన 2001లో పాత యర్రవర్రపు శేషయ్య స్ఫూర్తితో తలుపులపై దేవుడి బొమ్మలు చెక్కడం, సిమెంట్ దిమ్మెలపై శిల్పాలు చెక్కడంలో ఆరితేరారు. ఈ క్రమంలోనే తాజాగా రామాయణంలోని పాత్రలు, విశిష్ఠతలను 2 అడుగుల మందం గల టేకుచెక్కపై 3 నెలల సమయంలో చెక్కాడు. ఈ కళ అందరినీ ఆకట్టుకుంటోంది.
శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి సమీపంలో పాత జాతీయ రహదారి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప జిల్లాలో అద్దె ఆర్టీసీ బస్సులతో తరచూ ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 16వ తేదీన కడప శివారులో స్కూటీని ఢీకొనగా ఇద్దరు మృతి చెందారు. మరుసటి రోజే కడప డిపోకు చెందిన అద్దె ఆర్టీసీ, కారును ఢీకొనగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మొత్తంగా చూసుకుంటే 2024 జనవరి నుంచి జూన్17 వరకు ఎనిమిది ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవ్వగా …ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు.
ఐటీఐల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20 నుంచి 22 వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చిత్తూరు ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి తెలిపారు. మొదటి రోజు మెరిట్ ప్రకారం ఉదయం 1 నుంచి 100 వరకు, మధ్యాహ్నం 101 నుంచి 205వరకు అడ్మిషన్లు ఇస్తారు. 21న 206నుంచి 350వరకు, తర్వాత 351 నుంచి 451వరకు, 22న ఉదయం 452నుంచి 600వరకు, మధ్యాహ్నం 601నుంచి 743 వరకు ప్రవేశాలు జరుగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.