Andhra Pradesh

News June 19, 2024

డిప్యూటీ CMగా పవన్.. బొట్టుపెట్టి శుభాకాంక్షలు తెలిపిన వర్మ

image

జనసేన అధినేత, పిఠాపురం MLA డిప్యూటీ CMగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పవన్‌ను కలిసి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం బొట్టు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

News June 19, 2024

విజయవాడ: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దమ్మాలపాటి.?

image

కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఆయన 2016 మే 28 నుంచి 2019 ఏజీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. 1991లో దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు.

News June 19, 2024

గుంటూరు జిల్లాలో 2.4 మి.మీ వర్షపాతం

image

జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కొల్లిపర మండలంలో 12.8, చేబ్రోలు 12, దుగ్గిరాల 9.8, మేడికొండూరు 6.8, గుంటూరు తూర్పు 0.8, గుంటూరు పశ్చిమ 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

News June 19, 2024

అద్దంకి : పామాయిల్ ట్యాంకర్ బోల్తా

image

అద్దంకి- నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న మహిళలు పామాయిల్ తీసుకెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని క్రేన్ సహాయంతో యాంకర్‌ను పక్కకి తొలగించారు.

News June 19, 2024

తూ.గో.: మన జిల్లా MLAకు కీలక బాధ్యత

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో మరో MLAకు కీలక బాధ్యత దక్కింది. రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్యచౌదరిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకొన్నారు. చట్టసభలో చంద్రబాబు తర్వాత అధికసార్లు గెలిచిన MLA ఈయనే కావడంతో బాధ్యత అప్పగించారు. ఇప్పటికే పిఠాపురం MLA పవ‌‌న్‌కు డిప్యూటీ CMగా, రామచంద్రపురం MLA సుభాష్‌కు కార్మికశాఖ మంత్రిగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే.
☛ పవన్ నేడు, సుభాష్ రేపు మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

News June 19, 2024

గుంటూరు: ANU డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొఫెసర్ పి. రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 11,103 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 8,899 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అదనపు పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి ప్రకాశరావు మాట్లాడుతూ.. రీ వాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.1,240 చెల్లించి జూలై 2వ తేదీల లోగా అందజేయాలన్నారు.

News June 19, 2024

వైసీపీ అక్రమాలపై విచారణ జరిపిస్తాం: సీఎం రమేశ్

image

ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఎంపీగా గెలిచిన రమేశ్‌ను విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రవీందర్ అధ్యక్షతన నాయకులు మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుషికొండపై 10 ఎకరాల్లో విలాసవంతమైన కట్టడాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎక్కడా లేని విధంగా విశాఖలో భూదందాలు జరిగాయన్నారు.

News June 19, 2024

విజయవాడ: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దుమ్మలపాటి

image

సీనియర్ న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్‌ని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించి. కాగా ఆయన 2016 మే 28 నుంచి 2019 ఏజీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించి దస్త్రాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. ఈ నెల 20న తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఆయన చంద్రబాబు అరెస్ట్, కేసుల నేపథ్యంలోఆయన అలుపెరగని న్యాయపోరాటాలు చేశారు.

News June 19, 2024

కర్నూలు: యువకుడి దారుణ హత్య

image

ఆత్మకూరు(M) కురుకుందకు చెందిన ఖాదర్‌వలి హత్యకు గురయ్యాడు. సీఐ లక్ష్మీనారాయణ వివరాలు.. ఈనెల 16న కురుకుందకు చెందిన ఫారుక్, కృష్ణాపురానికి చెందిన ముర్తుజావలి హైదరాబాద్ నుంచి ఆత్మకూరుకు బస్సుల్లో వస్తుండగా డ్రైవర్ పక్కన కూర్చొనే విషయంలో గొడవపడ్డారు. 17న ఫారుక్ కురుకుందలో ఉన్నాడని తెలుసుకుని ముర్తుజావలి తన మిత్రులతో(ఖాదర్)కలిసి వెళ్లి వాగ్వాదానికి దిగారు. గొడవలో ఖాదర్‌ని కత్తితో పొడవడంతో చనిపోయాడు.

News June 19, 2024

పాతాళానికి తొక్కినా బుద్ధి మారలేదు: మంత్రి అచ్చెన్న

image

ప్రజలు ఎన్నికల్లో ఓడించి పాతాళానికి తొక్కినా వైసీపీ నేతల బుద్ధి మారలేదని మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. టీడీపీ హయంలో 72% పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయిందని ఆయన ఫైరయ్యారు. నోరు తెరిస్తే అన్నిటికి చంద్రబాబే కారణమంటూ చేసిన అంబటి వ్యాఖ్యలకు మాజీ మంత్రి అచ్చెన్న Xలో కౌంటర్ ఇచ్చారు.