Andhra Pradesh

News March 20, 2024

బైండోవర్ కేసుల నమోదుకు పోలీసుల సన్నద్ధం: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నాయకులు, కార్యకర్తలు, అనుమానిత వ్యక్తులు, నేరచరిత్రుల గుర్తించేందుకు పోలీసు అధికారులు కసరత్తు చేపట్టారు. సదరు వ్యక్తులను గుర్తించి ఐపీసీ106, 107, 108, 109, 110 కింద కేసు నమోదు చేసిన తర్వాత తహశీల్దారు ఎదుట హాజరుపరచనున్నారు.

News March 20, 2024

పవన్‌ను నేను కలవలేదు: పిఠాపురం వర్మ

image

పవన్ కళ్యాణ్‌ను ఇటీవల తాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని వర్మ పేర్కొన్నారు. ‘పవన్‌తో నేను రెండు మూడు సార్లు ఫొటో దిగాను. 2014లో పవన్‌ను కలిసిన ఫొటోను అప్పుడప్పుడు జనసేన నేతలు వాడుతున్నారు. గతంలో పవన్‌ను కలిసినప్పుడు విజయానికి సీక్రెట్ ఏంటని నన్ను అడిగారు. ఎప్పుడూ కష్టపడుతూ ఉంటానని చెప్పా. అప్పుడు పవనే పిలిచి ఫొటో తీసుకుందామని అడిగారు’ అని ఆయన జ్ఞాపకాలను వర్మ గుర్తు చేసుకున్నారు.

News March 20, 2024

విశాఖ: ‘ఎంపీ రూ.500 కోట్ల భూముల ఆక్రమణ’

image

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నగరంలో రూ.500కోట్ల విలువైన క్రైస్తవ భూములను ఆక్రమించినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. విశాఖ నగరం ప్రజాశాంతి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆయనపై కేసు వేసి జైలుకు పంపిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

News March 20, 2024

తెర్లాంలో పిడుగు పడి గొర్రెలు మృతి

image

తెర్లాం మండలం చిన్నయ్య పేటకు చెందిన గొర్రెలు, మేకల మందపై పిడుగు పడి పది మేకలు మృతి చెందాయి. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సుమారుగా 25గొర్రెలు మృతి చెందినట్లు తెలుస్తుంది. అధిక సంఖ్యలో మూగజీవాలు మృతి చెందటంతో గొర్రెల కాపరులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో పొలాల్లో ఉన్నవారు ఇండ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 20, 2024

కృష్ణా: నాడు వైసీపీకి ప్రత్యర్థులు.. నేడు వైసీపీ అభ్యర్థులు

image

2019లో వైసీపీకి ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన దేవినేని అవినాశ్, వల్లభనేని వంశీ తాజాగా వైసీపీ తరపున బరిలోకి దిగనున్నారు. 2019లో గుడివాడలో టీడీపీ తరపున బరిలో దిగి ఓడిన అవినాష్ వైసీపీలోకి చేరి తాజాగా విజయవాడ తూర్పు నుండి బరిలో దిగనున్నారు. నాడు టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలో చేరి గన్నవరం నుంచి మరోసారి బరిలో నిలిచారు. వీరిని గెలుపు వరించేనా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News March 20, 2024

నెల్లూరు: 420కి పైగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు

image

ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాగం పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,470 కేంద్రాలను పరిశీలించామన్నారు. ఇందులో 420కు పైగా క్రిటికల్ సెంటర్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

News March 20, 2024

గుంటూరు జిల్లా పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు

image

ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సీఎం శౌర్య పతకం మంగళవారం ఉన్నతాధికారులు ప్రకటించారు. వారిలో గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐగా పనిచేసిన కె.వాసును ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపిక చేశారు. ఇంటెలిజెన్స్‌లో ఉన్న ఎస్ఐ మధుసూదన్ రావు, ఆర్‌ఐ వెంకటరమణ, R SI సంపత్ రావు, కానిస్టేబుళ్లు త్రిమూర్తులు, భాస్కరరావులకు ముఖ్యమంత్రి శౌర్య పతకం వరించింది.

News March 20, 2024

ప్రకాశం: ఇటు కొత్త.. అటు పాత

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. YCPలో ఒంగోలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులకు స్థాన చలనం కల్పించారు. TDP మాత్రం దాదాపు పాత నాయకులనే బరిలోకి దింపుతోంది. దర్శి, చీరాల అభ్యర్థులను కూటమి ఇంకా ప్రకటించనప్పటికీ అక్కడ కూడా దాదాపు లోకల్ వాళ్ల బరిలో ఉండే అవకాశం ఉంది. రెండు పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు.

News March 20, 2024

KNL: 9 మంది వాలంటీర్లపై వేటు…

image

కర్నూలు జిల్లా కలెక్టర్ కమ్ జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 9మంది వాలంటీర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన ఏడుగురు, కర్నూలుకు చెందిన ఇద్దరు వాలంటీర్లపై వేటు పడింది. ఈ మేరకు సంబంధిత వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

News March 20, 2024

కడప: కోడ్ వచ్చినా.. కడపలో వీడని ఉత్కంఠ

image

ఎన్నికల కోడ్ వచ్చినా జిల్లాలో కొన్ని స్థానాలపై ఉత్కంఠ వీడలేదు. YCP అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి 6 స్థానాలను ప్రకటించింది. ఇందులో ఇద్దరు కొత్తవారికి అవకాశం ఇచ్చింది. జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, కోడూరు స్థానాలను ప్రకటించలేదు. జమ్మలమడుగు, బద్వేలు స్థానాలు పొత్తులో భాగంగా BJPకి.. రాజంపేట, కోడూరులో ఒకటి జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక కడప MPకి ముగ్గురు పోటీలో ఉన్నారు.