India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో CM జగన్ పర్యటించనున్నట్లు వైసీపీ నాయకులు వెల్లడించారు. ఈనెల 27న ఇడుపులపాయ నుంచి ఆయన ‘మేమంతా సిద్ధం’ పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రొద్దుటూరులో CM జగన్ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 28న నంద్యాల, 29న కర్నూలు జిల్లాలో నిర్వహించే బస్సు యాత్ర, బహిరంగ సభలో CM జగన్ పాల్గొననున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలోని ముగ్గురు వాలంటీర్లపై వేటు వేసినట్లు రిటర్నింగ్ అధికారిని ఆర్డీవో మధులత తెలిపారు. చేజర్ల మండలం పాడేరు గ్రామంలో మేకపాటి విక్రం రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇద్దరు వాలంటీర్లు పాల్గొన్నారు. సంగం MPDO కార్యాలయంలో రాజకీయ నాయకులతో కలిసి ఓ వాలంటీర్ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. దీంతో ముగ్గురిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
నేడో, రేపో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కొందరు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. విజయవాడ తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో విజయవాడ టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.
సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని భారత్–యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. ట్రయంఫ్ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ తూర్పు నావికాదళ ప్రధాన కార్యలయానికి వచ్చిన ఆయన ఐఎన్‌ఎస్ జలశ్వ యుద్ధ నౌకలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు.
ఏలూరు జిల్లాలో మంగళవారం జరిగిన పదో తరగతి పరీక్ష 24,209 మందికి గానూ 23,452 మంది రాశారు. 757 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 1342 మందికి 423 మంది హాజరయ్యారు. 919 మంది గైర్హాజరయ్యారు. అటు ప.గో జిల్లాలో 21,462 మందికి గానూ 20,455 మంది హాజరు కాగా.. 1007 మంది ఆబ్సెంట్ అయినట్లు పేర్కొన్నారు. వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 1493 మందికి గానూ 69 మంది ఆబ్సెంట్ అయ్యారు.
ఎన్నికల సంసిద్ధతపై సత్యసాయి కలెక్టర్ కార్యాలయ అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డీఆర్ఓ కొండయ్య తదితరులతో ఎన్నికల కమిషనర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ప్రొద్దుటూరులో 27న సీఎం జగన్ నిర్వహించే బస్సు యాత్ర బహిరంగ సభకు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్డులో సభకు స్థలం అనువుగా ఉంటుందని వైసీపీ నాయకులతో ఆయన చర్చించారు. వైసీపీ ప్రోగ్రాం మెంబర్ చంద్రహాసరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, JCS జిల్లా కోఆర్డినేటర్ కల్లూరు నాగేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ భవనాలు ప్రాంగణాల ఆవరణలో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు తీసుకున్నట్లు తెలిపారు.
కోనసీమ మహిళలు కొబ్బరి పీచుతో తయారు చేస్తున్న బొమ్మలను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా విక్రయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కాకినాడ లేపాక్షి మేనేజర్ వీరబాబు తెలిపారు. మంగళవారం ఆయన మామిడికుదురు మండలం పాసర్లపూడిలోని ఆక్సిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో నిర్వహిస్తున్న గ్రామ దుకాణ్ కొబ్బరి పీచు బొమ్మల విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. బొమ్మలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు.
భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్స్, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ వీడియో గ్రాఫర్లు ఎన్నికలకు సంబంధించిన ప్రతి చిన్న ఘటనను వీడియోగ్రఫీ చేయాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో అన్ని టీమ్‌ల వీడియో గ్రాఫర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.