Andhra Pradesh

News March 20, 2024

ఒంగోలు: ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి

image

ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. ఒంగోలులోని కలెక్టర్ పరిపాలనా భవనంలో ఎన్నికల సిబ్బందికి మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పారు. అవసరమైన సామగ్రిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని చెప్పారు.

News March 20, 2024

గ్యాస్ సిలెండర్లపై అదనంగా వసూలు చేస్తే చర్యలు: జేసీ

image

వంట గ్యాస్ సిలెండర్ల పంపిణీలో అదనంగా వసూలు చేసే గ్యాస్ కంపెనీ డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి హెచ్చరించారు. 15 కిలోమీటర్ల లోపు వరకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరాదన్నారు. కొంతమంది గ్యాస్ సిలెండర్ డెలివరీ బాయ్స్ పంపిణీకి అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వంట గ్యాస్ పంపిణీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

News March 20, 2024

ఎన్నికల కోడ్ అమలుకు సమన్వయంతో పనిచేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ విభాగాలు పొరపాట్లకు తావు లేకుండా పూర్తి సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. ఆర్‌ఓలు, ఈఆర్‌ఓలు, నోడల్ అధికారులు, ఎన్నికల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. సీ- విజిల్, సువిధ, ఎంసీసీ తదితర అంశాలను గమనించాలన్నారు.

News March 20, 2024

వినుకొండ ప్రాంతం ఆదరించింది: అనిల్ కుమార్

image

వినుకొండ మండలం పెద్ద కంచర్లలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పర్యటించారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు నుంచి వచ్చిన వారిని వినుకొండ ప్రాంతం ఆదరించిందని అన్నారు. తనను ఎంపీగా గెలిపించి, ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడుని గెలిపిస్తే నియోజకవర్గాన్ని, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని భరోసాని ఇచ్చారు.

News March 20, 2024

లక్షకు పైగా నగదు లావాదేవీలు జరిపిన వారి వివరాలు తెలపండి

image

కలెక్టర్ కార్యాలయం నందు బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లక్ష రూపాయలకు పైగా నగదు లావాదేవీలు జరిపిన వారి వివరాలు ప్రతిరోజూ అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ ప్రదీప్, ఎన్నికల ఖర్చు మోనిటరింగ్ నోడల్ అధికారి విద్యాసాగర్, బ్యాంక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News March 20, 2024

అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచండి: కృష్ణా కలెక్టర్

image

ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ జిల్లాలో కోడ్ అమలులో ఉందన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచి వాటి వివరాలను పంపాలన్నారు. ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఎక్కువ మందికి సొమ్ము జమ అవుతుంటే ఆ వివరాలను తెలియజేయాలన్నారు.

News March 19, 2024

వైజాగ్ అందాలు అద్భుతం: యూఎస్ రాయబారి

image

టైగర్‌ ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ వచ్చిన భారత్‌లో యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ దంపతులు మంగళవారం కైలాసగిరిని సందర్శించారు. అక్కడి నుంచి విశాఖ అందాలను చూసి మంత్ర ముగ్ధులై ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ‘కైలాసగిరి నుంచి వైజాగ్‌ అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత ప్రాంతాన్ని సంరక్షిస్తూ మరింత అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దిన GVMCకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

News March 19, 2024

NTR: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు గమనిక

image

ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ట్రైన్ నెం.22701 విశాఖపట్నం- గుంటూరు, నెం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌లను ఏప్రిల్ 1 నుంచి 28 వరకూ రద్దు చేస్తున్నట్లు, రైల్వే వర్గాలు తాజాగా పేర్కొన్నాయి.

News March 19, 2024

అనకాపల్లి ఎంపీ సీటు ఖరారుకు ఇంకా సమయముంది: వైవీ

image

అనకాపల్లి ఎంపీ సీటు ఖరారు చేసేందుకు ఇంకా సమయం ఉందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. మంగళవారం విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.

News March 19, 2024

నందిగామ: ఘనంగా నూతన కోర్టు భవనాలు ప్రారంభం

image

నందిగామలోని కోర్టు కాంప్లెక్స్ లో నూతన సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, అడిషనల్ జూనియర్ జడ్జి కోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఎన్టీఆర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ శేష సాయి, హైకోర్టు జడ్జిలు కృపాసాగర్, గోపాలకృష్ణ మండేల పాల్గొని ప్రారంభించారు.