India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2027 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
సికిల్ సెల్ ఎనీమియా నివారణపై ఈనెల 19న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ తెలిపారు. పాడేరు తలారిసింగి ఇండోర్ స్టేడియంలో సదస్సు ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. 19న ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ కూడలి నుంచి ఇండోర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం డిల్లీ నుంచి పర్చువల్ విధానంలో సికిల్ సెల్ ఎనీమియాపై సదస్సు నిర్వహిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కల్యాణ్‌ని మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, మంగళవారం గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై చేపట్టిన చర్యలపై పవన్‌తో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ జిల్లా నాయకులు మంగళవారం భేటీ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితరులు జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. జిల్లాలోని రైతులకు రూ.2 వేలు చొప్పున అకౌంట్లలో జమకానుంది. కర్నూలు జిల్లాలోని 2.34 లక్షల మంది రైతులకు రూ.46.97 కోట్లు, నంద్యాల జిల్లాలోని 1.95 లక్షల మంది రైతులకు రూ.39.19 కోట్ల మేర సాయం అందనుంది. లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఈ లింక్ <
మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు, టీడీపీ మహిళా కమిటీ సభ్యులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణాన్ని కల్పిస్తానన్నారు. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కావలి నియోజకవర్గం నేత మాలేపాటి సుబ్బానాయుడు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. మాలేపాటి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం వైద్య పరీక్షల అనంతరం ఐసీయూ నుంచి వార్డుకు మార్చే అవకాశం ఉందని తెలిపారు.
సాలూరులో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. టౌన్ సీఐ వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ థియేటర్, చిన్ని లాడ్జి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని మంగళవారం సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహం గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోయిందని సీఐ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై సీతారం చెప్పారు.
నెల్లూరు జిల్లాలోని పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం నెల్లూరులోని పోలీస్ కార్యాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో నేర సమీక్షలు నిర్వహించాలని, లోక్ అదాలత్‌పై అవగాహన, రాత్రి పూట గస్తీ పటిష్టం చేయాలని, స్కూల్స్ కళాశాలలు ప్రారంభం, ముగింపు సమయంలో తప్పకుండా విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప-2’ మూవీ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మూవీలో హీరో అల్లుఅర్జున్ వినియోగించిన లారీతో పాటు జీపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటి వద్ద అభిమానులు, పర్యాటకులు పలువురు ఫొటోలు దిగుతున్నారు.
Sorry, no posts matched your criteria.