India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, మంగళవారం రాజాం, పలాస, సీతంపేట, టెక్కలి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రేపు పిడుగులు పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడలపై రాతలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల అంశాలపై జిల్లా కలెక్టర్‌లతో మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లో, వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని ఆయన ఆదేశించారు.
పది పరీక్షలలో తెలుగుకు బదులు హిందీ పరీక్ష రాసిన విద్యార్థిని ప్రియాంకబాయికు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారని మండల విద్యశాఖ అధికారులు రవికుమార్, కాంతారావులు తెలిపారు. కారంపూడి MEO ఆఫీస్‌లో వీళ్లు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజు కట్టే సమయంలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు బదులు హిందీ అని అప్లికేషన్‌లో సెలెక్ట్ చేశారన్నారు. దీనివల్ల హిందీ పేపర్ ఇచ్చారన్నారు. ఈనెల 31న తెలుగు పరీక్ష రాయిస్తామన్నారు.
పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కాపు అయితే, నేనూ కాపు ఆడపడుచునే అని అన్నారు. 100 శాతం కాపుల మద్దతు తనకే ఉంటుందని, అన్ని కులాల్లో తనను అభిమానించేవారు ఉన్నారన్నారు. చుట్టం చూపుగా వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోయే వారిని ప్రజలు నమ్మరని సెటైర్స్ వేశారు. పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
కూడేరు మండలం ఉదిరిపికొండ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని జల్లిపల్లి గ్రామానికి చెందిన పవన్ (22)గా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా దోర్నాల చెందిన మల్లికార్జున అనే వ్యక్తి చిలకలూరిపేట వద్ద జరిగిన ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వినుకొండ సమీపంలో స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.
విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. మంగళవారం హిందీ పరీక్షలకు మొత్తం 23890 విద్యార్థులు మంగళవారం హాజరయ్యారు. వారిలో 443 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎటువంటి చూసి రాతలు గానీ, మాస్ కాపీయింగ్ వంటి పిర్యాదులు అందలేదన్నారు. జిల్లా మొత్తం హిందీ పరీక్ష సజావుగా జరిగిందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వెల్లడించారు. ఏడుగురు ముద్దాయిలను గుర్తించామని తెలిపారు. బొబ్బిలికి చెందిన నారయణరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగతా వారి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని వెల్లడించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మార్చి 23న సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలో రెండు కుటుంబాలను పరామర్శిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం పదో తరగతి హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహింగా..458 మంది విద్యార్థులు హాజరు కాలేదని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకుంటున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.